కొల్లాపూర్, సెప్టెంబర్ 15 : నార్లాపూర్ మొదటి లిఫ్ట్‌లో మోటర్‌ను సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించి బొంగురాలమిట్ట వద్ద ఏర్పాటు చేసిన సభావేదికపై ప్రసంగించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఉదయ్‌కుమార్ సంబందిత అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన, ఏర్పాట్లపై శుక్రవారం సభావేదిక ప్రాంగణంలో ఏఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఆర్డీవోలు, తాసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్పీ మనోహర్, అదనపు కలెక్టర్‌తో కలిసి సమీక్షించారు.
సీఎం పర్యటన సక్రమంగా జరిగేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలను చేపట్టినట్లు ఎస్పీ వివరించారు. 761మంది కానిస్టేబుళ్లు, 471మంది హోంగార్డ్సు, 150మంది మహిళా కానిస్టేబుళ్లు, 156మంది ఎస్సైలు, 393 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 19మంది డీఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, ఆరుగురు ఎస్పీలు విధుల్లో ఉంటారన్నారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ డీఎస్పీ మోహన్‌కుమార్, స్థానిక ఆర్డీవో నాగరాజు, ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు, తాసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.