బాలానగర్, అక్టోబర్ 17 : ఈనెల 18న జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు యువత అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ యూత్ వింగ్ మండలాధ్యక్షుడు సుప్ప ప్రకాశ్ కోరారు. మంగళవారం మండలంలోని తిరుమలగిరి, పెద్దబావితండాలో యువకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని యువకులు, నాయకులు, ప్రజాప్రతినిధులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జగన్నాయక్, మహేశ్, రవినాయక్ పాల్గొన్నారు.
మిడ్జిల్‌లో..
మిడ్జిల్, అక్టోబర్ 17 : జడ్చర్ల నియోజకవర్గంలో నిర్వహించే ప్రజా అశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, ఎంపీపీ సుదర్శన్, జెడ్పీటీసీ శశిరేఖ, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు జంగిరెడ్డి, సోషల్ మీడియా మండలాధ్యక్షుడు భీమ్రాజు, నాయకులు సుధాబాల్రెడ్డి తెలిపారు. మంగళవారం బీఆర్ఎస్ నాయకులు మంగళవారం వేర్వేరు ప్రకటనలో తెలిపారు. ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
రాజాపూర్‌లో..
రాజాపూర్, అక్టోబర్ 17 : బుధవారం జడ్చర్ల పట్టణంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వద సభను విజయవంతం చేద్దామని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, యూత్వింగ్ అధ్యక్షుడు వెంకటేశ్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంతోపాటు కుచ్చర్కల్, చెన్నవెల్లి, దోండ్లపల్లి, తిర్మలాపూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. సీఎం సభను విజయవంతం చేసేందుకు మండలంలోని రైతులు, మహిళలు, నాయకులు, యువకులు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహులు, రమేశ్‌నాయక్, నరహరి, మహిపాల్‌రెడ్డి, అనంద్‌గౌడ్, రామకృష్ణా గౌడ్, సర్పంచులు పాల్గొన్నారు.