తెలంగాణ రైతుల గుండె కోతను వివరించిన రైతు దీక్ష
వడ్లు కొనాల్సిందేనంటూ అల్టిమేటం జారీ చేసిన సీఎం కేసీఆర్
ఢిల్లీ సభను స్వాగతించిన అన్నదాతలు
పాల్గొన్న మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రజాప్రతినిధులు
దేశ రాజధానిలో కేసీఆర్ చేపట్టిన మహా దీక్షతో ఢిల్లీ దద్దరిల్లింది. కనీవినీ ఎరుగని రీతిలో ఓ రాష్ట్ర ప్రభుత్వమే రైతుల కోసం దీక్ష చేయడం సంచలనంగా మారింది. తెలంగాణ రైతుల సంక్షేమమే ధ్యేయంగా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రికి అన్నదాతలు పలికారు. వడ్లు కొనాల్సిందేనంటూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా రాష్ట్ర మంత్రివర్గమంతా ఆందోళన చేపట్టింది. కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ చేపట్టిన దీక్షను దేశమంతా స్వాగతించిందని ఢిల్లీకి వెళ్లిన ఉమ్మడి మహబూబ్‌నగర్ టీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఢిల్లీలో దీక్షలో పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గతంలో కనీవినీ ఎరుగని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే దేశ రాజధాని కేంద్రంగా రైతుల కోసం దీక్ష చేయడం సంచలనంగా మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బాగుపడ్డ రైతును తిరిగి అన్యాయం చేసేందుకు ప్రయత్నించిన కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో యావత్ తెలంగాణ తిరగబడింది. వడ్లు కొనాల్సిందేనంటూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా రాష్ట్ర మంత్రివర్గమంతా ఆందోళన చేపట్టింది. కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ చేపట్టిన దీక్షను దేశమంతా స్వాగతించిందని ఢిల్లీకి వెళ్లిన టీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వచ్చి దేశ రాజధానిలో దీక్ష చేసే పరిస్థితి వచ్చిందంటేనే కేంద్రం వైఖరి ఏంటో అర్థమవుతుందని ఢిల్లీవాసులలు చర్చించుకున్నట్లు పాలమూరు నేతలు తెలిపారు. తమ కోసం సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులంతా ఢిల్లీ వెళ్లి కేంద్రంపై యుద్ధం చేయడాన్ని ఉమ్మడి జిల్లా రైతన్నలు స్వాగతించారు.
ఇప్పటికే రైతుబంధు, రైతు బీమా, నిరంతర ఉచిత విద్యుత్, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందిస్తూ తమకు అండగా నిలిచిన తెలంగాణ సర్కార్.. కేంద్రం నిర్లక్ష్యంపైనా పోరాటం చేయడం చాలా గొప్ప విషయమని, ఈ అంశం చరిత్రలో నిలిచిపోతుందని రైతులు పేర్కొంటున్నారు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి కేంద్రం మెడలు వంచిన ఉత్తరాది రైతులకు నాయకత్వం వహించిన టికాయత్ సైతం దీక్షకు సంఘీభావం ప్రకటించడం గొప్ప విజయంగా నేతలు చెబుతున్నారు. ఢిల్లీ దీక్షతో కేంద్రం దిగిరాక తప్పదని రైతుబంధు సమితి నేతలు పేర్కొంటున్నారు. ఆది నుంచి కూడా సీఎం కేసీఆర్ అన్నదాతకు అండగా ఉన్నారని.. ఆయన రైతు బాంధవుడని మరోసారి నిరూపితమైందని అన్నదాతలు అంటున్నారు. వడ్ల కొనుగోలుకు సంబంధించి ఈ పోరాటం అంతం కాదు.. ఆరంభం మాత్రమేనని చెబుతున్నారు. ఢిల్లీ రైతు దీక్ష విజయవంతంగా పూర్తి చేసుకుని మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్ పర్సన్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, పలువురు రైతులు తెలంగాణకు తిరిగి వచ్చేశారు. ఢిల్లీ దీక్ష సక్సెస్ అవ్వడంపై టీఆర్ఎస్ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. రైతుల కోసం నిరంతరం పోరాటం జరుగుతుందని టీఆర్ఎస్ నాయకులు తెలిపారు.
కేంద్రం దిగిరావాలి..
ఢిల్లీలో ధర్నా విజయవంతమైంది. ఇకనై నా కేంద్రం దిగొచ్చి ధాన్యం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలి. గతంలో ఎవ రూ కూడా ముఖ్యమంత్రి హోదాలో రైతుల కోసం ఆందోళనలు చేపట్టిన దాఖలాలు లేవు. ఢిల్లీలో టీఆర్ఎస్ ధర్నా చేస్తుంటే.. ఇక్కడి బీజేపీ నాయకులు ధాన్యం కొనుగోలు చేయాలని తాసిల్దార్లకు వినతిపత్రాలు ఇవ్వడం శోచనీయం. టీఆర్ఎస్ సర్కార్ ఎప్పుడూ రైతు సంక్షేమానికి పాటుపడుతుం ది. ధాన్యం కొనుగోలు చేసేవరకు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం.
– చిట్టెం సుచరితరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యురాలు, నారాయణపేట
బీజేపీని బొందపెట్టాలి..
దేశాన్ని నాశనం పట్టిస్తున్న బీజేపీని బొందపెట్టాలి. కేంద్రం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తు న్న సీఎం కేసీఆర్‌ను తట్టుకునే శక్తిలేక పరోక్షం గా రైతులపై వివక్ష చూపిస్తున్నది. పోరాటాల తో కేంద్రం కండ్లు తెరిపిస్తాం. ఢిల్లీలో ధర్నా చూశాకనైనా కేంద్రం తీరులో మార్పు రావా లి. కేంద్రం దిగొచ్చి ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. కేంద్రం వైఖరిపై సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా ఆందోళన విస్తృతం చేయనున్నారు.
– పోకల మనోహర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు, నాగర్‌కర్నూల్
కమలం నేతలను తిరగనివ్వం
వడ్లు కొనేందుకు నిరాకరిస్తున్న బీజేపీ ప్ర భుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తాం. కేంద్రాన్ని ఒప్పించే దమ్ము, ధైర్యం లేని బీజేపీ నేతలను గ్రామాల్లో తిరగనివ్వం. ధాన్యం కొనకపోతే వారిని తరిమికొడతాం. ధాన్యం కొనకుంటే బీజేపీ పతనం తప్పదు. రైతుల కష్టాలను దేశ ప్రజలకు తెలిపేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీలో ధర్నాకు దిగాల్సి వచ్చింది. తెలంగాణ సత్తా కేంద్రానికి చూపిస్తాం.
– రాజేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు, అచ్చంపేట
ఢిల్లీ మెడలు వంచుతాం..
కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీలో తెలంగాణ రై తుల తడాఖా చూపించాం. బీజేపీ సర్కార్ ది గొచ్చి ధాన్యం కొనుగోలు చేసేవరకు పో రాటం చేస్తాం. దశల వారీగా ఉద్యమాన్ని మ రింత ఉధృతం చేస్తాం. కేంద్రం తలవంచక త ప్పని పరిస్థితులు సృష్టిస్తాం. రాష్ట్ర బీజేపీ నే తలు ధర్నా చేసేందుకు సిగ్గుండాలి. రైతుల నోట్లో మట్టి కొట్టాలని కేంద్రం చూస్తున్నది. ఇతర రాష్ర్టాల్లో మాదిరిగా తెలంగాణలోనూ ధాన్యం కొనాలి.
– సీఎం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, అచ్చంపేట
రైతుల పక్షాన ఉండాలి..
సీఎం కేసీఆర్ మొక్కవోని పట్టుదలతో ఢిల్లీలో దీక్ష చేపట్టారు. కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేయిస్తాడు. ఆ నమ్మకం రైతులకు ఉంది. ఇక్కడి నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే కేంద్రాన్ని ఒప్పించి వడ్లు కొనుగోలు చేసేలా చూడాలి. రైతుల పక్షాన నిలబడాలి. అంతేకాని రాజకీయ స్వాలభ్యం కోసం రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు.
– హన్మంత్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు, కోస్గి
ఇకనైనా కండ్లు తెరవాలి..
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనతో ఢిల్లీ దద్దరిల్లింది. అన్ని రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ ఆందోళనతో కేంద్రం దిగొచ్చి ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి నెలకొన్నది. కొనుగోలు చేయకుంటే సీఎం సారథ్యంలో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడుతాం. ఇప్పటికైనా బీజేపీ సర్కార్ కండ్లు తెరిచి రైతులకు బాసటగా నిలవాలి. ధాన్యం కొనుగోలు చేయకుం టే రైతుల ఉసురు తగుల్తది. మట్టికొట్టుకుపోతరు.
– చెన్నయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు, జోగుళాంబ గద్వాల
మొండి వైఖరి వీడాలి..
తెలంగాణలో అధిక శాతం వరికి అనుకూలమైన భూములు ఉన్నాయి. కేంద్రం తెలంగాణ రైతులను మోసం చేస్తున్నది. పక్క రాష్ర్టాల మాదిరిగా కేంద్రం తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. వ్యవసాయం కోసం రైతులను ప్రోత్సహించాల్సింది పోయి నట్టేట ముంచాలని చూస్తున్నది. బీజేపీ సర్కార్ మొండి వైఖరి వీడాలి.
– గిరిధర్‌రెడ్డి, రైతు, కంచన్‌పల్లి
రైతుల కష్టాలు తెలియని బీజేపీ..
రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కే సీఆర్ సర్కార్ కృషి చే స్తున్నది. వ్యవసాయం అంటే తెలియని కేంద్ర మంత్రి గోయల్‌కు రైతుల కష్టాలు ఎలా కనబడతాయి. కనీసం ఏ పంటకు ఎంత స మయం పడుతుంది..? ఎంత సాగునీరు అవసరం..? ఏ ఎరువులు వాడాలి..? ఏ కాలానికి ఏ పంటలు వేయాలో కూడా తెలియదు. అలాంటి వ్యక్తి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కావడం మన దురదృష్టం. బీజేపీకి అనుకూలంగా ఉన్న రాష్ర్టాల్లో ధాన్యం కొనుగోలు చేస్తూ.. వ్యతిరేక రాష్ర్టాల్లో కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇది రాచరిక వ్యవస్థకు నిదర్శనం. కేంద్రమే వడ్లు కొనేదాక నిరసన కార్యక్రమాలు చేపడుతాం.
– తిరుమల మహేశ్, టీఆర్ఎస్ నాయకుడు, వనపర్తి
రైతుల కోసమే నిరసనలు..
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి. అన్నదాత సంక్షేమం కోసమే ఆందోళన బాట పట్టారు. ఇది రాజకీయ సమస్య కాదు.. మనందరిది.. అందరం రైతులకు అండగా నిలవాలి. కేంద్రం మెడలు వంచడానికి సీఎం కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయానికి రైతుల తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. ధాన్యం కొనుగోలు చేసేదాకా నిరసనలు కొనసాగించాలి. – గోవింద్, రైతు, మల్దకల్
కేంద్రం వడ్లు కొనాల్సిందే..
తెలంగాణ వడ్లను పంజాబ్, హర్యాన రా ష్ర్టాల మాదిరిగానే కేంద్రం కొనుగోలు చే యాలి. దేశవ్యాప్తంగా ఒకే విధమైన నిబంధనలు అమలుచేయాలి. సీఎం కేసీఆర్ రా ష్ట్రంలో రైతులు నష్టపోకూడదనే సంకల్పంతోనే ఢిల్లీలో ధర్నా చేపట్టారు. కేంద్రం మెడ లు వంచి ధాన్యం కొనుగోలు చేయించేదాకా సీఎం విశ్రమించరు. సీఎంకు దేశంలోని రైతు సంఘాల ప్రతినిధులు మద్దతు పలకడం శుభపరిణామం. – మేకల నాగిరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు, అయిజ
ధాన్యం కొనేదాకా పోరాటం..
ధాన్యం కొనేదాకా పోరాటం కొనసాగుతుంది. చాలా రోజులుగా సీఎం కేసీఆర్ పి లుపుమేరకు రైతుల పక్షాన నిరసన చేప ట్టాం. ధాన్యం కొనుగోలు చేయించే బాధ్యత తమదే అని చెప్పిన రాష్ట్ర బీజేపీనేతలు నేడు కిమ్మనడం లేదు. వింత ధోరణి అవలంబించడం విడ్డూరంగా ఉంది. ఢిల్లీలో సీఎం కేసీఆర్ రైతుల పక్షాన దీక్ష చేయడంపై అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం దిగొచ్చి ధాన్యం కొనుగోలు చేయాల్సిందే.
– వేపూరి రాములు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు, నారాయణపేట
రైతుల ఆగ్రహాన్ని చూడకతప్పదు..
తెలంగాణలో కేంద్రం ధాన్యం కొనుగో లు చేయకుంటే రైతుల ఆగ్రహాన్ని చూడక త ప్పదు. తమతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బా గుపడినట్లు చరిత్రలో లేదు. రైతు సంక్షేమా న్ని విస్మరిస్తున్న కేంద్రానికి తగిన గుణపా ఠం చెబుతాం. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుం టే.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ నట్టేట ముంచుతున్నది. ఇది వారికి తగదు.
– సిరాజుద్దీన్, రైతు, కోయిలకొండ
చిన్న చూపు తగదు..
వారం రోజుల్లో వడ్లు మార్కెట్‌కు వస్తాయి. ముందస్తుగా కేంద్రం వడ్లు కొనుగోలు చేసేం దుకు చర్యలు చేపట్టాలి. కేంద్రానికి తెలంగాణ రైతులపై చిన్నచూపు తగదు. తప్పనిసరిగా ధాన్యం కొనాల్సిందే. లేకుంటే బీజేపీ సర్కార్‌కు తగిన బుద్ది చెబుతాం.
– రాజుయాదవ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు, హన్వాడ