ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు పడుతున్నాయి. మెడికల్ కళాశాలను ప్రారంభించుకోవడం వైద్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన మహాఘట్టం ఆవిష్కృతమైనది. వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. మెడికల్ విద్యాభ్యాసం కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాది అదనంగా 1150 సీట్లు పెరిగాయి. వీటికనుగుణంగా నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తాం. సూపర్ స్పెషాలిటీ వైద్యం ప్రతి ఒక్కరికీ అందాలి. ఇదే మా చిరకాల స్వప్నం.
– కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ముఖ్యమంత్రి
నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలల తరగతులు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాలల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొన్నది. నూతన విద్యార్థులకు పూలు అందించి అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆన్లైన్లో మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు పడుతున్నాయని స్పష్టం చేశారు. కళాశాలలు ప్రారంభమైన ఈ రోజు వైద్య విద్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజన్నారు. కార్యక్రమాలకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కలెక్టర్లు ఉదయ్‌కుమార్, షేక్ యాస్మిన్‌బాషా, జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్‌లో కళాశాల భవన నిర్మాణానికి 30 ఎకరాల భూమి కేటాయించిన ఉయ్యాలవాడ రైతులకు ఎమ్మెల్యే మర్రి ధన్యవాదాలు తెలిపారు.
గ్రామీణులకు సేవ చేయాలి..
నాగర్‌కర్నూల్ జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల వస్తుందని ఎవరూ ఊహించలేదు. ప్రజల కలను సాకారం చేస్తూ నేడు మెడికల్ కళాశాలను ప్రారంభించుకున్నాం. సీఎం కేసీఆర్‌కు జిల్లావాసుల తరఫున కృతజ్ఞతలు. వనపర్తి జిల్లాకు వైద్య కళాశాల మంజూరైనప్పుడు.. 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగర్‌కర్నూల్‌కు వైద్య కళాశాల మంజూరు కాదనుకున్నారు. ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కలిసి.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. కానీ నాగర్‌కర్నూల్‌కు వైద్య కళాశాల మంజూరు చేయాలని కోరాను. సీఎం కేసీఆర్ కళాశాల మంజూరు చేసి ప్రారంభించారు. వైద్య రంగం పటిష్టంగా ఉంటే సులభంగా విజయాలు సాధించొచ్చు. ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. నాగర్‌కర్నూల్ కళాశాల విద్యార్థులు బాగా చదివి.. మూడేండ్లపాటు ఇక్కడి మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించాలి. కళాశాల నిర్మాణానికి 30 ఎకరాల అసైన్డ్ భూమి కేటాయించిన ఉయ్యాలవాడ రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు.
– మర్రి జనార్ద్దన్రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే
అన్ని రకాల వసతులున్నాయి..
రాష్ట్రంలో ఎనిమిది కళాశాలలు ఒకేసారి ప్రారంభించడం చాలా సంతోషకంగా ఉన్న ది. ఏడాది కిందట కళాశాల భవనం స్థలం లో వరి పైర్లు ఉండేవి. నేడు ఎంతో అ ద్భుతంగా.. అన్ని రకాల సదుపాయాలతో కూడిన కళాశాల రూపుదిద్దుకున్న ది. ఇందుకు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మ ర్రి జనార్దన్‌రెడ్డికి ధన్యవాదాలు. కళాశాలలో బాలురు, బాలికలకు వేర్వేరు వసతి గృహాలు ఉన్నాయి. తరగతులు ప్రారంభించడానికి అవసరమైన సౌకర్యాలు, విద్యాబోధకులు ఏర్పాటు చేశాం. కళాశాలకు 150 సీట్లు కేటాయించగా.. రాష్ట్ర కోటాలో 93 మంది, కేంద్రం కోటాలో ఆరుగురు మొదటి జాబితాలో ప్రవేశాలు పొందారు. రెండో జాబితా ప్రవేశాలు పూర్తయ్యాక తరగతులు ప్రారంభమవుతాయి.
– ఉదయ్‌కుమార్, కలెక్టర్, నాగర్‌కర్నూల్
కళాశాలకు రూ.3 కోట్లు ఇస్తాం..
15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వనపర్తి మెడికల్ కళాశాల అభివృద్ధికి రూ.3 కోట్లు ఇస్తాం. పేదలకు విద్య, వైద్యం ఉచితం గా అందడంతో జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయి. మెడిక ల్ కళాశాలలో సిబ్బంది, ఇతర పోస్టుల కోసం భర్తీ ప్రక్రియ పూర్తయ్యింది. వనపర్తిలో రోడ్ల విస్తరణ, ఇంజినీరింగ్, నర్సింగ్ కళాశాల నిర్మాణం జరుగుతున్నది. అభివృద్ధికి ప్రజలు, నాయకులు రాజకీయాలకతీతంగా సహకరించాలి. మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు వనపర్తి జిల్లాకు రావడం ఎంతో సంతోషంగా ఉన్నది. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలి.
– రాకాసి లోకనాథ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్, వనపర్తి
సీఎంకు అద్భుతమైన విజన్..
ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ఏర్పాటు అనేది సీఎం అద్భుతమైన విజన్‌కు తార్కాణం. దక్షిణ తెలంగాణ అభివృద్ధిలో వనపర్తి టాప్‌లో ఉన్నది. జిల్లా ఎడ్యుకేషన్ హబ్‌గా మారనున్నది. జిల్లాను అభివృద్ధి చేసేందుకు మంత్రి నిరంజన్‌రెడ్డి నిరంతరం పరితపిస్తుంటారు. వైద్య విద్య కోసం ప్రపంచం వైపు మనం చూడకుండా.., ప్రపంచమే తెలంగాణ వైపు చూడాలన్న గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ పయనిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో విద్యార్థులు చదువులు మానేసి స్వదేశానికి తిరిగి వచ్చారు. అటువంటి పరిస్థితి మనకు రావొద్దని జిల్లాకో మెడికల్, నర్సింగ్ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. సెకండ్ కౌన్సెలింగ్ పూర్తయింది. వనపర్తి మెడికల్ కళాశాలలో ఉన్న 150 సీట్లలో 83 మంది జాయిన్ అయ్యారు. కాలేజీ ఫస్ట్బ్యాచ్కు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. దానిని నిలబెట్టుకోవాలి. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డికి కృతజ్ఞతలు. మెడికల్ కళాశాలలో అన్ని రకాల సదుపాయాలు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు.
– షేక్‌యాస్మిన్‌బాషా, కలెక్టర్, వనపర్తి