లింగాల, అక్టోబర్ 26 : ముగ్గురు యువకులకు శిరోముండనం చే యించిన ఘటనకు బాధ్యుడైన ఎ స్సై జగన్మోహన్ను సస్పెండ్ చే యడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ అ ట్రాసిటీ కేసు నమోదు చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ డి మాండ్ చేశారు. శనివారం లింగాలకు చేరుకొని ముగ్గురు యువకులు, చుట్టుపక్కల ప్రజలతో ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం స్థానిక జీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 14న లింగాల పెట్రోల్ బంక్లో జరిగిన గొడవ లో ముగ్గురు యువకులకు స్టేషన్లోనే శిరోముండనం చేయించడం ఎస్సై చ ట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడమేనన్నారు. వారిని స్టేషన్లోనే ఉంచి మూడ్రోజులపాటు చిత్రహింసలు పెట్టి సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడని ఆరోపించారు.
తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలే తప్పా అవమానపర్చేలా గుండు గీయించడం సరికాదన్నారు. పోలీసు ఉన్నతాధికారులు నామమాత్రంగా చర్యలు చేపట్టడం అనుమానాలకు తావిస్తోందని దుయ్యబట్టారు. ఎస్సైని అటాచ్ చేయడం చూస్తుంటే రాజకీయ జోక్యం తోడైందని అనుమానం వ్యక్తం చేశారు. ఆయనను పూర్తిగా విధుల నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యద ర్శి రఘునాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మణ్శర్మ, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సు భాన్, ప్రధాన కార్యదర్శి బాలయ్య, కార్యవర్గ సభ్యుడు బాలయ్య పాల్గొన్నారు.