పార్లమెంట్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కించపరిచేలా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలపై ఊరువాడా భగ్గుమన్నది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. కేవీపీఎస్, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా, సీఐటీయూ, సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బడుగుల ఆశాజ్యోతి అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్‌షాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా మాట్లాడిన షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.
– నెట్వర్క్ మహబూబ్‌నగర్, డిసెంబర్ 20