వనపర్తి టౌన్, డిసెంబర్ 24 : శాంతికి మారు పేరు యేసుక్రీస్తు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధిక జనాభా జరుపుకొనే పండుగ క్రిస్మస్ అని అన్నారు. క్రైస్తవులందరు యేసు క్రీస్తు పాపుల త్యాగాల కోసం మరణించి తిరిగి లేచారని గుర్తు చేశారు. అనంతరం వనపర్తి పట్టణంలోని అన్ని చర్చిల పాస్టర్లు, పెద్దలు క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి, డాక్టర్ నిర్మలా లివింగ్స్టన్, డాక్టర్ రాఘవులు , జనార్దన్, కృపాకుమార్, ఏసన్న, శ్రీకాంత్, గంధం విజయ్, కాళిదాస్, ఎర్నెస్ట్, ఐజక్, జాన్మార్కు, బీఆర్ఎస్ నాయకులు వాకిటి శ్రీధర్, గులాం ఖాదర్ ,ప్రేమ్‌నాథ్‌రెడ్డి, తిరుమల్, రహీం, రమేశ్ తదితరులు ఉన్నారు.