నారాయణపేట, అక్టోబర్ 16 : నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల మేర కు మెడికల్ కళాశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టీనా జెడ్ చుంగ్తా అధికారులను ఆదేశించారు. నారాయణపేట మండలం అప్పక్‌పల్లి శివారులో ఉన్న మెడికల్ కళాశాలను బుధవారం కలెక్టర్ సిక్తాపట్నాయక్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో కేవలం ఫస్టియర్ తరగతులకు కావాల్సిన వసతులే కాకుండా సెకండియర్ తరగతులకు వస తి సౌకర్యాలు సమకూర్చుకోవాలన్నారు.
అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాలకు సంబంధించి ఏమేం అవసరమో వైద్య నిపుణులతో చర్చించారు. మెడికల్ కళాశాల మూ డో అంతస్తులో బ్లడ్ బ్యాంక్, డయాలసిస్, ఇతర ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలన్నా రు. అంతకు ముందు పట్టణంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన, చిన్న పిల్లల దవాఖానను తనిఖీ చేశారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయం, ఎంసీహెచ్(మదర్ అండ్ చైల్డ్ హెల్త్) విభాగాలను పరిశీలించారు. కార్యక్రమంలో టీజీ ఎంఐడీసీ ఎండీ హేమంత్, ట్రైనీ కలెక్టర్ గమీమనరుల, అకాడమిక్ డీ ఎంఈ శివరాంప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ రాంకిషన్, పాలమూరు మెడికల్ కళాశాల డైరెక్టర్ రమేశ్, డీఎంహెచ్‌వో సౌభాగ్యలక్ష్మి, జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ మల్లికార్జున్ ఉన్నారు.
జడ్చర్ల, అక్టోబర్ 16 : జడ్చర్ల పట్టణంలోని వంద పడకల ఏరియా దవాఖానను హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా జెడ్ చుంగ్తా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె దవాఖానలోని ఓపీ, చిన్నపిల్లల వార్డులు, జనరల్ వార్డులతోపాటు అన్ని విభాగాలను పరిశీలించారు.