కల్వకుర్తి రూరల్/ఉప్పునుంతల, సెప్టెంబర్ 4 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పెద్దబోయపల్లి గ్రా మానికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు, దీపిక దంపతులు. వీరికి ముగ్గరు సంతానం మో క్షిత(8), వర్షిణి(6), శివధర్మ(4). ఇటీవల భార్యభర్తల మధ్య కలహాల నేపథ్యంలో ఆ గస్టు 30న వెంకటేశ్వర్లు పిల్లలను తీసుకొని శ్రీశైలం వెళ్లాడు.
అదేరోజు రాత్రి అక్కడి నుం చి నాగర్కర్నూల్ జిల్లా హాజీపూర్ వచ్చాడు. ఆగస్టు 31న కల్వకుర్తి పట్టణానికి వెళ్లి పురుగుల మందు కొనుగోలు చేసి తాగాడని పోలీసులు భావిస్తున్నారు. వెంకటేశ్వర్లు మృతదేహం వెల్దండ మండలం పెద్దాపూరు సమీపంలోని బూరకుంట వద్ద లభ్యమైంది. బైక్పై చిన్నారులతో వెంకటేశ్వర్లు వెళ్లడాన్ని సీసీ కెమెరాలో పరిశీలించి హైదరాబాద్- శ్రీశైలం రహదారులకు ఇరువైపులా పోలీసు బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
అలాగే సూర్యతండా, అయ్యవారిపల్లి, రాయిచెడ్ తదితర గ్రామాల ప్రజలతో అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్, సీఐ నాగరాజు, ఎస్సైలు విజయభాస్క ర్, వెంకట్రెడ్డి సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. సూర్యతండా శ్మశానవాటిక పక్కన ఉన్న గుట్టపై ఉన్న ముళ్లపొదల్లో కాల్చివేయబడిన వర్షిణి, శివధర్మల శవాలను గుర్తించారు. వెంకటేశ్వర్లు సోదరుడు మల్లిఖార్జునరావు ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, చిన్నారుల మృతిపై తండ్రిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.