భూత్పూర్, జూన్ 10 : పిల్లలు చదువుతోపాటు ఆటలు, డాన్స్, డ్రాయింగ్ లాంటి కలలపై దృష్టి సారించాలని మండల సింగిల్ విండో చైర్మన్ కదిరె అశోక్ రెడ్డి కోరారు. మంగళవారం స్థానిక వివేకానంద విద్యాలయంలో వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా కలల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. ఈనాడు క్రీడలు, ఆటపాటలతో ఎందరో రాణిస్తున్నారని తెలిపారు. క్రీడలలో సచిన్ టెండూల్కర్, ఆటపాటలతో రాము రాథోడ్ లాంటి వాళ్లు విశేషంగా రాణిస్తున్నారని తెలిపారు. చిన్నప్పటినుండి కలలను గుర్తించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు. వివేకానంద విద్యాలయంలో కలలకు కొదవలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వివేకానంద పాఠశాల కరస్పాండెంట్ నర్సింహులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సత్యనారాయణ గౌడ్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నవీన్ గౌడ్, వివిధ పార్టీ నాయకులు గోప్లాపూర్ సత్యనారాయణ, సాదిక్, సత్య గౌడ్, గోవర్ధన్ గౌడ్, మల్లేష్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.