జననేతలకు జేజేలు
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను శుక్రవారం జిల్లావ్యాప్తంగా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, కోస్గి ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
- జిల్లావ్యాప్తంగా వేడుకలు
- రాన్నంటిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
- హాజరైన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి
- కేక్ కట్ చేసి సంబురాలు చేసిన బీఆర్ఎస్ శ్రేణులు
- అనాథాశ్రమాల్లో పండ్లు, దుప్పట్లు పంపిణీ
- మొక్కలు నాటిన నాయకులు
- ఆలయాల్లో ప్రత్యేక పూజలు
- పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాల నిర్వహణ
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను శుక్రవారం జిల్లావ్యాప్తంగా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, కోస్గి ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదానం, కేక్‌లు కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. పేట అనాథ ఆశ్రమంలో పిల్లలకు అన్నదానం, జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖాన, ప్రభుత్వ పిల్లల దవాఖానల్లో మొక్కలు నాటడంతోపాటు, పండ్లు, బ్రెడ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మక్తల్ లయన్స్ క్లబ్ భవనంలో రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు.

పలు గ్రామాల్లో ఉపాధి కూలీలు పని ప్రదేశంలో సీఎం జన్మదిన వేడుకలను జరుపుకొన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడని పలువురు కొనియాడారు. దేశానికే ఆదర్శవంతమైన నాయకుడని, ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని పలువురు నాయకులు ఆలయాల్లో పూజలు చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాలు, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

