అమరచింత, అక్టోబర్ 27 : కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కురుమూర్తిస్వామి పట్టువస్ర్తాల పనులను ఆదివారం మండల కేంద్రంలోని భక్తమార్కండేయస్వా మి ఆలయంలో చేనేత కార్మికులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తిస్వామి ఉద్దాల ఉత్సవం వచ్చే నెలలో ప్రారంభం కానుండగా, పట్టువస్ర్తాలను అమరచింత చేనేత కార్మికులు తయారు చేయడం అనవాయితీగా వస్తున్నది.
అందులో భాగంగానే ఈ ఏడాది నిర్వహించే ఉద్దాల ఉత్సవానికి కురుమూర్తిస్వామితోపాటు పద్మావతి, అలివేలుమంగ ధరించే పట్టువస్ర్తాలను అమరచింత చేనేత కార్మికులు నిమయనిష్టలు, ఉపవాసలతో తయారు చేస్తున్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, చేనేత కార్మికులు దేవరకొండ లచ్చన్న, మేర్వరాజు, పారుపల్లి చింతన్న, వగ్గు రామలింగం, యాదగిరి వీరన్న, సీతారాములు, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.