మహబూబ్‌నగర్, జనవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రెండోరోజు గ్రామసభలు గందరగోళంగా జరిగాయి. సర్కారు ఇచ్చి న ఆరు గ్యారెంటీ పథకాలు దక్కుతాయో లేదోనన్న ఆందోళనలో జనం గ్రామసభల్లో రచ్చరచ్చ చేస్తున్నారు. ఆరు గ్యా రెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు ఏడాది తర్వాత ఆత్మీయభరోసా, ఇంది రమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తామని రెండురోజులుగా గ్రామ సభలు నిర్వహిస్తున్నది. తొలిరోజు ఆందోళనలతో అట్టుడుకిన గ్రామ సభలు..రెండో రోజూ బుధవారం కూడా అదే స్థాయిలో కొనసా గాయి. కొన్ని చోట్ల అధికారులు సమాధానం ఇవ్వలేక సభలను అర్ధాంతరంగా నిలిపివేసి జారుకున్నారు.
కుటుంబాలు పెద్దవి కావ డం..పేదలు కనీసం తినడానికి రేషన్ దొరుకుతుందనే ఆత్రుతతో కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇటీవల ఇంటింటి సర్వేలో కూడా భారీ ఎత్తున రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు అందజేశారు. చివరకు జాబితాల్లో తమ పేర్లు గల్లంతు కావడంతో జనం పరేషాన్ అవుతున్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాలో ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు.
ఎక్కడా సభలు సజావుగా జరగడం లేదు. మహాలక్ష్మి పథకం కింద ప్రారంభించిన ఉచిత బస్సు పథకం కూడా అభాసుపాలవుతున్నది. తమ గ్రామంలో బస్సులు ఆపడం లేదని నారాయణపేట జిల్లాకు వచ్చిన ఇన్చార్జి మంత్రిని నిలదీ శారు. నర్వ మండలం కల్వాల గ్రామంలో గ్యారెంటీ స్కీముల్లో తమపేర్లు లేవని ఆందోళనకు దిగారు. ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన మొత్తం పోలీసుల పహారా మధ్య కొన సాగింది.
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో ప్రజలు నిలదీయడంతో అధికారులు సమాధానాలు చేప్పలేక వెనుదిరిగారు. మాగనూరులో ఆత్మీయ భరోసా జాబితాలో తప్పులున్నాయంటూ అధికారులపై ఎగబడ్డారు. గద్వాల మున్సి పాలిటీలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో ఏకంగా ఓ ప్రభుత్వ ఉద్యోగి పేరు రావడంతో జనం అవాక్కయ్యారు. అయిజ మండలం ఉత్తనూరు గ్రామంలో ఇచ్చిన దరఖాస్తులు ఆన్లైన్ చేయకపోవడంతో అధికారులను నిలదీశారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రామసభల్లో రేషన్ కార్డుల జాబితాలు తప్పుల తడకలు కావడంతో జనం ఆగ్రహంతో ఉగిపోతున్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించడంతో ప్రజలు పెద్ద ఎత్తున రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు అందజేశారు. అంతేకాకుండా దరఖాస్తులను ఆన్లైన్ చేసుకున్నారు. అయితే ప్రభుత్వం నిర్వ హించిన ప్రజాపాలన దరఖాస్తులో రేషన్‌కార్డుల ఊసేలేదు. అయి నా జనం పెద్దఎత్తున ఖర్చుపెట్టుకుని సొంతంగా రెవెన్యూ అధికా రులకు వందల కొలది దరఖాస్తులు ఇచ్చారు. మండలాల్లో, మున్సి పాలిటీల్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో అధికారులు వీటిని ఏం చేయాలో తెలియక వాటిని కార్యాలయాల్లో భద్రపర్చారు. తీరా ప్రభుత్వం కొత్త కార్డులు ఇస్తామని..అర్హులైన వారి జాబితా సిద్ధం చేయాలని ఆదేశించడంతో గతంలో ఆన్లైన్లో చేసిన దరఖా స్తులను కొన్నింటిని జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ఆఫ్‌లైన్‌లో ఇచ్చిన వాటిని పరిగణలోకి తీసుకోకపోవడంతో అసలు గొడవకు కారణంగా మారుతున్నది. ఉన్నతాధికారులు, కిందిస్థాయి అధికా రులు చెబుతున్న లెక్కలకు పొంతన లేకుండా పోయింది.
ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో మాత్రం ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఉంది. కానీ గ్రామసభలకు ముందే ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లమీద సర్వేలు నిర్వహించారు. ఈజా బితాలు సిద్ధం చేశారు. అయితే కార్డుల జారీ కోసం జాబితా మా త్రం హడావిడిగా తయారు చేయడంతో గందరగోళం నెలకొన్నది. దీంతో చాలా మంది దరఖాస్తులు చేసుకున్నా తమపేర్లు లేకపోవ డంతో ఆందోళనకు గురవుతున్నారు. రేషన్ కార్డులు తమకు వస్తా యా? లేదా అని భయం లబ్ధిదారుల్లో నెలకొన్నది. అయితే కాంగ్రెస్ మాత్రం తమ వారికే వస్తాయని ప్రచారం చేసుకుంటున్నది.
ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాల్లో ఎమ్మెల్యేలు చెప్పిన పేర్లే దర్శనమిస్తాయని ఇటీవల నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి చెప్పిన మాటలే నిజమవుతున్నాయి. ఆయా నియెజకవర్గాల్లో ఎమ్మెల్యేలు క్యాంప్ అఫీసుల నుంచి పంపించిన జాబితాలనే తుదిరూపు ఇస్తున్నారు. ఇన్నాళ్లు చేసుకున్న దరఖాస్తులు అన్నీ బుట్టదాఖలే అనే విమర్శలు వస్తున్నాయి. అం తేకాక ప్రజాపాలనలో భాగంగా ఇచ్చిన సమాచారం..ఆతర్వాత రెవె న్యూ కార్యాలయాల చుట్ట్టూ తిరిగి ఇచ్చిన వన్నీ వట్టిదేనని ఆ పార్టీ నేతలే అంటున్నారు. మొత్తంపై అర్హులను ఎంపిక చేయాల్సిన చోట అనర్హులకు అందలం ఎక్కిస్తున్నారని ప్రభుత్వంపై విరుచు కుపడుతున్నారు.