తిమ్మజీపేట : తిమ్మాజీపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి ( Chairman Balakishta Reddy) మంగళవారం సందర్శించారు. హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్ వెళ్తున్న ఆయన, మార్గమధ్యంలో తిమ్మాజీపేట ఆగి, పాఠశాల స్థితిగతులను తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల వివరాలు, తరగతి గదులు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. విద్యార్థుల సామర్థ్యాలను, గత పరీక్షల్లో ఫలితాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈవో సత్యనారాయణ శెట్టి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.