తాండూర్ : తాండూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో జాతీయ ఉపాధిహామీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర జలశక్తి అభియాన్ ( Central Jal Shakti Abhiyan ) టీమ్ మెంబర్ కొల్లి రాంబాబు ఆధ్వర్యంలో పరిశీలకుల బృందం బుధవారం పరిశీలించింది (Inspections ) . బోయపల్లి, కాసిపేట, కిష్టంపేట, పెగడపల్లి, తాండూరు, గోపాల్‌నగర్, రేచిని గ్రామపంచాయతీల పరిధిలో పర్యటించి ఇంకుడు గుంతలు, ఫాం పాండ్, పెర్కులేషన్ మినీ ట్యాంక్ నిర్మాణ పనులు పరిశీలించారు.
పనుల నాణ్యతను పరిశీలించడంతో పాటు ఆయా గ్రామాల్లో నీటి సంరక్షణకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన పనులు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిశీలన నివేదికను కేంద్ర జలశక్తి అభియాన్ అధికారులకు పంపనున్నట్లు తెలిపారు. వీరివెంట డీఆర్డీవో, స్టాఫ్ నోడల్ ఆఫీసర్ సదానందం, ప్లాంటేషన్ మేనేజర్ శీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో నందకుమార్, గ్రామ పంచాయతీల టీఏలు, ఎఫ్ఎలు, కార్యదర్శులు పాల్గొన్నారు.