పెబ్బేరు రూరల్, ఫిబ్రవరి 6 : బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో భాగంగా పెబ్బేరు మండలానికి చెందిన నాయకుడు పాతపల్లి గోవిందు సోమవారం ఏపీలోని శ్రీశైలంలో పర్యటించారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలను తెలుపుతూ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్లను పంపిణీ చేశారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. దేశమంతా పథకాలు అమలుకావాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమని చెప్పారు. కార్యక్రమంలో నేతలు సురేందర్, హుస్సేన్, విష్ణు, రమేశ్ పాల్గొన్నారు.