మహబూబ్‌నగర్‌టౌన్, నవంబర్ 1: జిల్లా కేంద్రంలోని 20వ వార్డు మర్లులో బుధవారం వార్డు కౌన్సిలర్ అనంతరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. బీఆర్ఎస్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మద్దతిచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 7వ వార్డులో కట్టారవికిషన్‌రెడ్డి ప్రచారం చేశారు. ఆయా వార్డుల్లో వార్డుల కౌన్సిలర్లు ప్రచారం నిర్వహిస్తున్నారు.
మహ్మదాబాద్, నవంబర్ 1: మండలంలోని నంచర్లలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతిచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బిక్షపతి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేశారు. బుధవారం ప్రచారం ప్రారంభించడంతో యువకులు, జనాలు ఎనలేని ఉత్సాహంతో ముందుకొచ్చి పార్టీ విజయానికి తమవంతు కృషిచేసి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిని గెలుపించుకుంటామని స్వచ్ఛందంగా ముందుకొచ్చారని పేర్కొన్నారు. జనాల్లో వచ్చిన స్పందన చూస్తుంటే బీఆర్ఎస్ తెలంగాణలో హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని ధర్మాపూర్‌లో యూత్వింగ్ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఉమ్మడి మండల యువ నాయకులు జోగుకృష్ణ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో ముందుకెళ్లాయన్నారు. మరోసారి బీఆర్ఎస్ను ఆదరించి మహేశ్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోపాల్‌రెడ్డి, తిర్మల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సువర్ణ, రాజు, సాయి పాల్గొన్నారు.
గండీడ్, నవంబర్ 1: కాంగ్రెస్ పార్టీ పలికే ప్రగల్బాలా మాటలు నమ్మి ఓటేస్తే పథకాలన్నింటినీ కనుమరుగు చేస్తారని జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ మాధవి పేర్కొన్నారు. మండలంలోని పగిడ్యాల్‌లో బీఆర్ఎస్ నాయకులు బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పరిగిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిని మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సర్పంచులు రాణి, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ వెంకటయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యానాయక్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాలమూరు, నవంబర్ 1: మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని వెంకటాపూర్, కోడూర్, ఇప్పలపల్లి, ధర్మపూర్, చౌదర్పల్లి, జమిస్తాపూర్, బొక్కలోనిపల్లిలో బుధవారం బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరంగా సాగింది. నాయకులు ప్రజలకు మ్యానిఫెస్టో వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపివ్యడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. వెంకటాపూర్‌లో మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్ ప్రచారంలో పాల్గొని అభివృద్ధి పథకాలను గురించి వివరించారు.