మహబూబ్నగర్, డిసెంబర్ 10 : పోలీస్ కొలువుల ఎంపికకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు జిల్లాకేంద్రంలోని స్టేడియంలో పక్కా పర్యవేక్షణలో జరుగుతున్నాయి. మూడోరోజు శనివారం తెల్లవారుజామున 5గంటలకు దేహదారుఢ్య పరీక్షలు ఆరంభమయ్యాయి. 1000 మంది మహిళా అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 851మంది హాజరయ్యారు. వీరిలో 657 మంది అభ్యర్థులు ఈవెంట్స్ పూర్తిచేసి అనంతరం తదుపరి నిర్వహించే పరీక్షకు హాజరయ్యారు.
మహిళా అభ్యర్థులకు మరో మూడు రోజులపాటు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. పరీక్షలను ఎస్పీలు వెంకటేశ్వర్లు, చేతన ప్రత్యేకంగా పర్యవేక్షించారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్గా అదనపు ఎస్పీ రాములు, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఏవో కృష్ణయ్య, డీపీవో సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.