మహబూబ్‌నగర్ అర్బన్, జూన్ 14 : జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ట్రాఫిక్ అంతరా యం కలగకుండా, ఆర్టీసీ ఆదా యం పెంచేందుకు పదుల సంఖ్య లో కమర్షియల్ దుకాణాలు ఏ ర్పాటు చేశారు. వీటికి ఆర్టీసీ అధికారులు టెండర్లు కూడా వేశారు. కాగా, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల ప్రధాన రోడ్డు పక్కనే పండ్ల బండ్ల వ్యాపారులు విక్రయాలు కొనసాగిస్తున్నారు.
కమర్షియల్ షెటర్లు తుదిదశకు చేరుకోవడం తో శనివారం ఆర్టీసీ అధికారుల ఆదేశాలతో మున్సిపల్, పోలీసు అధికారులు తోపుడు బండ్లను బుల్డోజర్లతో తొలిగించడానికి సిద్ధమయ్యా రు.ఇక్కడే కొన్నేళ్లుగా పండ్లు అ మ్ముకొని జీవనం సాగిస్తున్న చి రు వ్యాపారులు బుల్డోజర్ను అ డ్డుకొని నిరసన వ్యక్తం చేస్తూ బై ఠాయించారు. పండ్ల వ్యాపారుల ఆందోళన తీ వ్రరూపం దాల్చడంతో ఎమ్మె ల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అక్కడకు చేరుకొని మున్సిపల్ అధికారు లు, పోలీసులను నిలువరించా రు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని హెచ్చరించారు.
బతుకుదెరువు కోసం వ్యాపారం చేసుకుంటుంటే మున్సిపల్ అధికారులు మా పొట్ట కొడుతున్నారు. చిరు వ్యాపారుల జోలికి వెళ్లమని క్లాక్‌టవర్‌లో నిలబడి సీఎం రేవంత్‌రెడ్డి మాట ఇచ్చిండు. ఇప్పుడేమో బుల్డోజర్లను తీసుకొచ్చి వెళ్లగొడుతామంటే సహించేది లేదు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి రెండు నెలల నుంచి మా బాధలు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ సర్కారులో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చిరు వ్యాపారులకు అండగా నిలిచారు. ఆయన ఉన్నన్ని రోజులు మా దగ్గరకు ఎవరూ రాలేదు.
– నర్సమ్మ, చిరువ్యాపారి
ఆర్టీసీ కమర్షియల్ షెటర్ల కోసం రూ.3లక్షల డిపాజిట్‌తో టెండర్లు వేశాం. షెటర్ల ఎదుట పండ్ల బండ్లు ఉంచితే టెండర్లు దక్కించుకున్న దుకాణదారులు వ్యాపారం ఎలా చేసుకుంటారు. ఆర్టీసీ స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం లేదు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డిని మరోమారు ప్రత్యేకంగా సంప్రదించి వివరిస్తాం.
– సంతోష్‌కుమార్, ఆర్టీసీ ఆర్ఎం, మహబూబ్‌నగర్