మహబూబ్‌నగర్, జూలై 26 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం ఊసే ఎత్తలేదు. సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన ఎత్తిపోతల పథకానికి బడ్జెట్లో కేటాయింపు జరుపకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా పొలిటికల్ స్టంట్ అని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తుతున్నారు. సొంత జిల్లాపై సీఎం కపట ప్రేమను చూపిస్తున్నారని మండిపడుతున్నారు. వెనుకబడిన నారాయణపేట జిల్లాలో ఈ ఎత్తిపోతల పూర్తయితే సాగునీరు, తాగునీటికి ఢోకా ఉండ దు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై రెండు నాల్కల ధోరణి వ్యవహరిస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గా ల్లో మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో భీమా ఎత్తిపోతల పథకంలో భాగమైన భూత్పూ రు జలాశయం నుంచి నాలుగు విడుతల్లో కానుకుర్తి వ రకూ నీళ్లు ఎత్తిపోసి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా దౌ ల్తాబాద్, కొడంగల్ మీదుగా బొంరాస్‌పేట వరకూ చెరువులు నింపి మొత్తం లక్ష ఎకరాలకు సాగునీరు అందిం చే లక్ష్యంతో నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. 2014లో అప్పటి ప్రభు త్వం మొదటి దశలో రూ.133 కోట్ల 50లక్షలతో పరిపాలన అనుమతులిస్తూ ఉత్వర్తులు జారీ చేసింది. ఇం దులో రూ.3.36 కోట్లు ప్రాథమిక సర్వే కోసం, రూ. 130.50 కోట్లు భూసేకరణ కోసం కేటాయిస్తూ ఉత్తుర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులను అప్పటి గవర్నర్ 2014 మే 23న జీవో నెంబర్- 69 ద్వారా జారీ చేశా రు. మొదట్లో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూ
రాల వెనుకభాగం జలాల నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు నర్వ మండలం ఎల్లంపల్లి నుంచి నీటిని తోడుకొని అక్కడి నుంచి కోయిల్‌కొండ వద్ద జలాశయం నిర్మించి, తిరిగి అక్కడి నుంచి నారాయణపేట – కొడంగల్ ప్రాంతాలకు నీటిని తరలించాలని అంచనా వేశారు. ఈ డిజైన్‌లో చాలా గ్రామా లు ముంపునకు గురవుతాయని భావించి మొదట అనుకున్న డిజైన్‌ను మార్చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపడతామని ప్రకటించింది.
ఇందులో భాగంగా రూ.3,556 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పథకానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎం రేవంత్‌రెడ్డి లిఫ్టు పనులకు శంకుస్థాపన చేశారు. దీనికి భీమా పథకంలో భాగంగా నిర్మించిన భూత్పూర్ జలాశయం నుం చే నీటిని తరలించనున్నారు. మొత్తం నాలుగు దశల్లో కృష్ణా జలాలను ఎత్తిపోయడం ద్వారా ఏడు టీఎంసీలను లక్ష ఎకరాలకు ఇవ్వాలని భావించారు. దీని వల్ల భూసేకరణ సమస్యలు వస్తాయని గుర్తించిన ప్రభుత్వం మూడు దశల్లోనే చేపట్టాలని పైగా భూగర్భ సొరంగాల స్థానంలో ప్రెషర్ మెయిన్ నిర్మించాలని నిర్ణయించారు. మొత్తం 10చెరువులకు నీటిని తరలించాల్సి ఉండగా సామర్థ్యాన్ని 0.9 టీఎంసీల నుంచి 2.1 టీఎంసీకి పెంచాలని మొదట్లో నిర్ణయించారు. తాజాగా 3.6 టీఎంసీల నిల్వకు వీలుగా జలాశయాలను సిద్ధం చేసేలా అంచనా వేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టు ఎగువ నుంచి కృష్ణానది నారాయణపేట జిల్లాలో ప్రవహిస్తుంది. కర్ణాటక, తెలంగాణ సరిహద్దులో మొదలుకొని జూరాల బ్యాక్ వాటర్ వరకు 60నుంచి 70కిలోమీటర్ల మేర ఈ జిల్లాలో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. అయితే ప్రస్తుతం ఈ పథకం కోసం కృష్ణా జలాలను నర్వ మండలం ఎల్లంపల్లి నుంచి తరలించాలని భావిస్తున్నారు. అయితే ఇక్కడి నుంచే కోయిల్‌సాగర్‌కు నీటిని మళ్లిస్తున్నారు. ఇదే పథకానికి ఇక్కడి నుంచి లింకు ఇవ్వడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు.
ఎల్లంపల్లికి సమీపంలోనే జూరాల బ్యాక్ వాటర్ నుంచి భీమా ప్రాజెక్టుకు నీటిని మళ్లిస్తున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి లింకు ఏర్పాటు ఏ విధంగా చేస్తారో అర్థం కాని ప్రశ్నగా మారింది. మొత్తంపైన కోయిల్‌సాగర్ ఆయకట్టుకు నీళ్లు మళ్లింపు దీని వల్ల ఎఫెక్ట్ అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికే వేల క్యూసెక్కుల నీళ్లు శ్రీశైలం వైపు పరుగులు పెడుతున్నా కోయిల్‌సాగర్‌కు అనుకున్న స్థాయి లో నీటిని మళ్లించలేకపోతున్నారు. నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కూడా ఇదే పరిస్థితి రావచ్చని ఆందోళన వ్యక్తమవుతుంది.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టడం కంటే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎక్స్టెన్షన్ చేయడం మే లని గతంలోనే సా గునీటి రంగ నిపుణులు తేల్చిచెప్పా రు. కరివెన, ఉదండాపూర్ రిజర్వాయ ర్ల నుంచి నీటిని ఇ టు నారాయణపేట నియోజకవర్గానికి అటు కొడంగల్ నియోజకవర్గానికి తరలించుకునే అవకాశం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ చేసి నారాయణపేట-కొడంగల్ ప్రాంతానికి కూడా సాగునీరు అందించేందుకు ఇందులో డిజైన్ చేశారు. తక్కువ ఖర్చుతో కాల్వల నిర్మాణానికి పూనుకోవాల్సిన సర్కారు ఆచరణ సాధ్యం కాని కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మళ్లీ తెర మీదికి తీసుకొచ్చి పొలిటికల్ డ్రామా ఆడుతున్నది.
– చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మక్తల్