కల్వకుర్తి రూరల్, అక్టోబ ర్ 1 : కల్వకుర్తి మండలం మార్చాల సత్యసాయినగర్ సూర్యలత స్పిన్నింగ్ మిల్లు లో మంగళవారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్కేవీ బలపరిచిన అ భ్యర్థి సూర్యప్రకాశ్‌రావు అ ధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. సూర్యలత కాటన్ మిల్లులో కార్మిక సం ఘం ఎన్నికల్లో బీఆర్ఎస్కేవీ బలపరిచిన అభ్యర్థిగా సూర్యప్రకాశ్‌రావు, ఐఎన్టీయూసీ(కాంగ్రెస్) అభ్యర్థిగా మాజీ సర్పంచ్ ఆనంద్‌కుమార్ బరిలో ఉన్నారు.
మంగళవారం కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో ఉదయం 7 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 450ఓట్లకు గానూ 438 ఓట్లు పోలవ్వగా అందు లో 251ఓట్లు సూర్యప్రకాశ్‌రావుకు 183 ఓట్లు ఆనంద్‌కుమా ర్ ఓట్లు పోలవగా 4ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదుకాగా 68ఓట్ల మెజార్టీతో సూర్య ప్రకాశ్‌రావు విజయం సాధించారు. సూర్యప్రకాశ్‌రావు విజయం సాధించడంతో అభిమానులు, కార్మికులు పెద్దఎత్తున సంబురాలు జరుపుకొన్నారు.
కాటన్ మిల్లు నుంచి కల్వకుర్తి పట్టణం ఆయా చౌరస్తాల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. పటాకులు కాలుస్తూ నృత్యాలు చేసుకుంటూ కార్మికులు, బీఆర్ఎస్ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.