వనపర్తి, మే 16 : అసెంబ్లీ ఎన్నికలకు ముందు ధాన్యానికి క్వింటాకు అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చి నేడు సన్నరకానికి మాత్రమే చెల్లిస్తామని సీ ఎం రేవంత్‌రెడ్డి మాటమార్చి రైతులను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో అన్ని రకాల ధాన్యానికి బోనస్ చెల్లించాలని డిమాం డ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించా రు. ఈ సందర్భంగా గట్టుయాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో ధ్యానం కొనుగోలుపై బోనస్ ఇస్తామనే హామీ కూడా ఉందని గుర్తు చేశారు.
కానీ ఈ రోజు ఆ మా ట మార్చి సన్న రకానికే బోనస్ ఇస్తామనడంతో కాంగ్రెస్ మోసాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయన్నారు. ఇ ప్పటికే రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా వంటి పథకా లు ఇవ్వకుండా రైతులను అరిగోస పెడుతున్నదన్నారు. ఎ న్నికల ముందు ప్రతి గింజనూ మద్దతు ధరతో కొంటామని, అందులో వరికి రూ.500, మొక్క జొన్నకు రూ.300, చె రుకుకు రూ.850, పప్పు ధాన్యాలపై రూ.300 నుంచి రూ.500 వరకు, పసుపు, మిర్చికి రూ.800 బోనస్ ఇస్తామని చెప్పి.. నేడు పరిస్థితులను అధ్యయనం చేస్తామనడం ఎంతవరకు సమంజసమన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేసి క్వింటాపై రూ.500 బోనస్ ఇవ్వాలని, లేదంటే రైతులు పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీ ధర్, జిల్లా మీడియా కన్వీనర్ అశోక్, ప్రధాన కార్యదర్శి రమేశ్, మండల నాయకులు రఘువర్ధన్‌రెడ్డి, మహేశ్వర్రె డ్డి, సేనాపతి, కౌన్సిలర్లు బండారు కృష్ణ, నాగన్నయాదవ్, కెంచె రవి, నాయకులు ప్రేమ్‌నాథ్‌రెడ్డి, రహీం, డానియే ల్, గిరి, సయ్యద్, జమీల్, సురేశ్, రవి, నాగరాజు, శ్రావణ్‌కుమార్, యుగంధర్‌రెడ్డి, జోహెబ్, బాలయ్య, శ్రీను, రాము, శ్యాం తదితరులు పాల్గొన్నారు.