మహబూబ్‌నగర్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్( BRS ) మద్దతుదారుల విజయం కొనసాగుతుంది. ముఖ్యంగా మహబూబ్‌నగర్ (Mahabubnagar ) జిల్లాలోని మహమ్మాదాబాద్ మండలం ఎలకిచెరువు తండా బీఆర్ఎస్ మద్దతుదారుడు సోమ్లా సర్పంచ్‌గా విజయం సాధించారు. మహబూబ్‌నగర్ తువ్వగడ్డ తండాలో చాందిని శంకర్ కాంగ్రెస్ మద్దతుదారుడిపై 66 ఓట్లతో గెలుపొందారు.

రాజాపూర్ మండలంలోని రాఘవపూర్ ,దోండ్లపల్లి, చొక్కం పేట్ ,కుతినేపల్లి, కోర్ర తండా గ్రామాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. రంగారెడ్డి పల్లి సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుదారుడు బాలవర్దన్ రెడ్డి కాంగ్రెస్ మద్దతుదారుడు పై 303 ఓట్ల తేడాతో గెలుపొందారు.
లాల్యా నాయక్ తండ సర్పంచిగా ప్రతాప్ నాయక్, వెల్డండ మండలం పోతేపల్లి గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ మద్దతుదారుడు తగుల్ల కొండల్ యాదవ్ 300 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. వంగూరు మండలం జాజాల గ్రామ సర్పంచ్ గా బీఆర్ఎస్ మద్దతుదారురాలు జిలకర కాశమ్మ 12 ఓట్ల తో గెలుపొందారు.

గోపాల్ పేట మండలం చాకలపల్లిలో బీఆర్ఎస్ మద్దుతుదారుడు లొంక శేషిరెడ్డి గెలుపొందారు.
