మక్తల్, మే 24 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి బాధిత రైతులకు భరోసా కల్పించా రు. మక్తల్ మండలంలోని కాట్రేవుపల్లి గ్రామ రైతులు మక్తల్‌లో చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి నివాస గృహంలో శనివారం ఆయనను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర భుత్వం నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భా గంగా భూముల కోల్పోతున్న రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తమకు ఇష్టారీతిలో భూముల్లో సర్వేలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం దృష్టికి తీసుకొచ్చారు.
ప్రతిరోజూ రెవెన్యూ అధికారులు ఏదో ఒక రూపంలో భూముల పైకి వచ్చి సర్వే పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని, పూర్తిస్థాయిలో అనుమతులను తీసుకున్న తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిందిగా బీఆర్ఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నామన్నా రు.
మక్తల్ నియోజకవర్గంలో మక్తల్ మండలంలోని భూ త్పూర్ వద్ద నిర్మించిన రిజర్వాయర్ 1.31 టీఎంసీ సామర్థ్యం మాత్రమే ఉందని, ఇకడి నుంచి కొడంగల్‌కు నీటిని ఏ విధంగా తరలిస్తారో సీఎంకే తెలియాలని, దీనిపై ఆయనకు పూర్తి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గం ప్రజలను మోసం చేయడానికి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందని, ఒకవేళ భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కొడంగల్‌కు నీటిని తీసుకెళ్తే భూముల కోల్పోతున్న రైతులకు వారు అడిగినంత నష్టపరిహారాన్ని అందించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణానికి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా ఇష్టారీతిలో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తే రైతులకు న్యాయం జరిగేంతవరకు బీఆర్ఎస్ తరఫున రైతుల పక్షాన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. రైతుల బాధను అర్థం చేసుకొని రైతుల పక్షాన నిలబడేందుకు భరోసా కల్పించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం కు కాట్రేవుపల్లి భూ బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.