వనపర్తి టౌన్, ఏప్రిల్ 28: అంచనాలకు మించి బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంత మైంద ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నా రు. కాంగ్రెస్ 17 నెలలపాలన, వైఫల్యాలు, అ బద్ధ్దపు హామీలు, దౌర్జన్యాలకు చెంపపెట్టు రజ తోత్సవ సభ అని చెప్పారు. 17 నెలల్లో తెలంగా ణను అన్ని రంగాల్లో ఆగం చేసిన కాంగ్రెస్ ప్రభు త్వాన్ని కేసీఆర్ ప్రశ్నించారని, అంశాలవారీగా వాటికి సమాధానం చెప్పలేని మంత్రులు కారుకూతలు కూస్తున్నారని.. కేసీఆర్‌పై చేసిన విమర్శలను వారి విజ్ఞప్తికే వదిలేస్తున్నామన్నారు. రజతోత్సవ సభతో యావత్ తె లంగాణ కేసీఆర్ వెన్నం టి ఉందని ప్రజలు గుర్తుచేశారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకొని సభ సజావుగా సాగకుండా ప్రజలు సభకు రాకుండా ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనావాసాల ముందు వారి ఆటలు సాగలేదన్నారు. మండు టెండలను లెక్క చేయకుండా లక్షలాదిగా తరలి వచ్చిన తెలంగాణ, ఉమ్మడి పాలమూరు, వనపర్తి నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి కృతజ్ఞతలు చెప్పారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
జడ్చర్ల, ఏప్రిల్ 28: వరంగల్‌లోని ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జడ్చర్ల నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో దూరం నుంచి అనేక ఇబ్బందులు పడు తూ కేసీఆర్ సభకు ఊహించని విధంగా ఉమ్మడి జిల్లా నుంచి కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. వారందరికీ పార్టీ తరఫున ధన్యవాదాలు. పార్టీ అధిష్టానం దూరం చాలా ఎక్కువ ఉన్నందు న తక్కువ జన సమీకరణ చేపట్టాలని చెప్పినప్పటికీ నియోజకవర్గాల్లో వినలేదు.. కొంతమంది సొంతంగా వాహనాలు సమకూర్చుకొని వచ్చారు.
వారందరికీ కూడా పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. స్వ చ్ఛందంగా తరలి వస్తున్న చాలామందిని పోలీసు యంత్రాంగం అడ్డుపెట్టి నిలిపివేసింది. అయినా కేసీఆర్‌పై ప్రేమతో చాలామంది కిలోమీటర్లు మేర నడుచుకుంటూ సభకు చేరుకున్నారు. మళ్లీ వాళ్లంతా క్షేమంగా ఇండ్లకు చేరేవరకు పార్టీ నాయకులతో సమన్వయం చేసుకున్నాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యకర్తలు తిరిగి గమ్యస్థానాల కు చేరుకున్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపితే సత్తా ఏంటో చూపిస్తాం.
కొల్లాపూర్, ఏప్రిల్ 28: అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఆశేషంగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సోమవారం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేండ్ల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలల్లో అసంతృప్తి పెల్లుబికిందన్నారు.
రాష్ట్రంలోని ఏ వర్గానికి కూడా ఒక్క సంక్షేమ పథకమైనా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. ఎవరూ ఊహించని విధంగా రజతోత్సవ సభకు కార్యకర్తలు లక్షలాదిగా తరలివచ్చినట్లు వెల్లడించారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. భవిష్యత్ బీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ కేసీఆర్ మళ్లా కావాలని అంటున్నారని చెప్పారు. పార్టీశ్రేణులు ధైర్యంగా ఉండాలని సూచించారు.