రేవల్లి, నవంబర్ 21 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రేవల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీలు ఇచ్చిందని, అందులో ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయలేదని, అలాంటి పార్టీకి స్థానిక ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కులేదన్నారు.
ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన అనంతరం ప్రణాళిక బద్ధంగా రాష్ర్టా న్ని అభివృద్ధి చేశారని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి జీవిన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేశారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు అరకొర రుణమాఫీ, రైతు భరోసా కూడా సక్రమంగా పంపిణీ చేయకపోవడంతోపాటు రైతులకు ఎరువులు, విత్తనాలు సరిగా అందజేయకపోవడంతో నిత్యం ఆందోళనలు చేసే పరిస్థితిని నెలకొందన్నారు. రాష్ట్రంలో సాగునీరు అందక, కరెంట్‌లేక 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులను రూ.32వేల కోట్లతో 90 శాతం పనులు పూర్తి చేయగా సొంత జిల్లా అని చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి పది శాతం పనులను కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును పడావు పెట్టారని ఆరోపించారు.
ఉమ్మడి గోపాల్పేట మండలంలో పరిపాలన ప్రజల చెంతకు రావాలిని రేవల్లి, ఏదుల మండలాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఆంజనేయుడి గుడిలేని గ్రామం లేనట్లుగానే మన అభివృద్ధి పథకం తెలియని, అం దని గ్రామం లే దని ఆయన పునరుద్ఘాటించా రు. పంచాయతీ ఎన్నికల కోసం మహిళలకు చీరల పంపిణీ చేస్తామని కాంగ్రె స్ కపట నాటకం ఆడుతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమం అనంతరం మండలంలోని నాగపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులతోపాటు వివిధ పార్టీల కార్యకర్తలు బీఆర్ఎస్ చేరగా వా రికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, నాయకులు నాగం తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ భీమయ్య,, మాజీ ఎంపీపీ బంకల సేనాపతి. మాజీ వైస్ ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, శివరాంరెడ్డి, కోఆప్షన్ నెంబర్ ఖాజా, నాయకులు పాపులు, శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.