అచ్చంపేట, ఆగస్టు 8 : కాంగ్రెస్ పార్టీ చెప్పిన భారీ మోసాల హామీలను నమ్మి మోసపోయిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను బొందపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్ పదేండ్ల పాలనలో ఆత్మహత్యలు లేని తెలంగాణ నిర్మాణం చేపడితే ఆదే కాంగ్రెస్ 600 రోజుల పాలనలో 600 మం ది రైతులు ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి కేసీఆర్ కళ్లముందే జరుగుతుంటే కేసీఆర్ గుండె కలిచివేస్తుందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. అచ్చంపేట పట్టణంలోని బీకేప్యాలెస్లో శుక్రవారం ని యోజకవర్గస్థాయి కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశా రు. అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జీ నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ లక్ష్మారెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బైకాని శ్రీనివాస్, ఇంతియాజ్ ఇసాక్, రంగినేని అభిలాష్‌రావు తదితరులు హాజరయ్యారు.
ముందుగా మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధించుకొని పదేండ్ల్లు అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామని అయితే అభివృద్ధి జరుగలేదని ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేయ్యలేదని, కాంగ్రెస్ చేసిన భారీ వాగ్ధానాలు ఆశపడి నమ్మారు. ఆశపడితే తప్పకుండామోసం జరుగుతది, ఆలోచన చేస్తే మోసానికి గురికాము కానీ అమలు కాని హామీలు చూసి మోసపొయిన సంగతిని రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి గుర్తు చేయాలని అన్నారు. పదేండ్లలో రైతులు ఎదురుచూడకుండా ఎరువులు అందుబాటులో ఉంచితే ఇవాళ ప్రతి మండలంలో చెప్పులను క్యూలో పెట్టి యూరియా కోసం ఎదురుచూసే దుస్థితి చూస్తున్నామని అన్నారు. కరెంట్ ఎన్నిసార్లు పోతుందో తెలియని దుస్థితి, ప్రాజెక్టులలో నీళ్లుండి ఇవ్వలేని సన్యాసి సర్కారును ఎన్నడూ చూడలేదన్నారు.
తెలంగాణ ప్ర జల ప్రయాణం 25 ఏండ్ల ప్రస్తానం. ఇంకా ప్రయాణం కొనసాగించాలి పదేండ్ల తర్వాత చిన్నతట్టు తగిలింది, ఇంకా మూడేళ్ల ప్రయాణంలో ఇంకేన్ని పరిణామాలు చూడాల్సి వస్తుందోనన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, బలోపేతంగా ఉండాలి, పార్టీని గెలిపించుకునేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని అన్నారు. నాయకులు ఎక్కడినుంచో రారు, పార్టీ అవకాశం ఇస్తే నాయకులు అవుతారు, పార్టీకి అనుభవం ఉంది, అంతబాగున్నప్పుడు ఉరుకులాడుతారు పార్టీకి అధికారంపోగానే ఎవరిదారి వారు చూసుకునే స్వార్థపరులు ఉంటారు. ఇది పార్టీకి కొత్తేమికాదు, 2008 ఉప ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాకుంటే పదిమంది ఎమ్మెల్యేలను అప్పట్లో వైస్ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌లో కలుపుకొని ఇంకా టీఆర్ఎస్ ఎక్కడుందని ఆనాటి పాలకులు చా లా హేళన, అవమానించిన ఘటనలు వివరించారు.
బీఆర్ఎస్కు తెలంగాణలో బంగారు భవిష్యత్ ఉంది, లేదనుకున్నవాళ్లకే భవిష్యత్తులేదన్నారు. రాబోయేరోజుల్లో కేంద్రం, రాష్ట్రంలో చక్రం తిప్పే పరిస్థితి కేసీఆర్‌కు వస్తుందని అన్నారు. అచ్చంపేటలో పార్టీని ఏవిధంగా కాపాడుకోవా లో అనే నినాదంతో ఉన్న క్యాడర్ పట్టుదలకు పాదాభివందనాలు చేస్తున్నానని అన్నారు. మీరే మీటింగ్ పెట్టి పిలిస్తే మేము వచ్చామన్నారు. రానున్నరోజుల్లో గ్రామ, మండలాల వారీగా కమిటీల నిర్మాణాలు, తొందరలోనే మాజీ మంత్రి కేటీఆర్ సభ ఉంటుందన్నారు. అంతవరకు మేము ఊరికే ఉండమని మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలం తలోక మండలం పంచుకొని బాధ్యతలు తీసుకొని పనిచేస్తామని, ఎనిమిదికి ఎనిమిది మండలాలు జెడ్పీటీసీలు, ఎంపీపీలు గెలిపించుకునేందుకు కార్యచరణ చేసుకొని ముందుకు వెళ్తామని అన్నారు.
కాంగ్రెస్ 20 నెలల పాలనలో ఆగమైందని, ఎన్నో అరాచకాలు, ఇబ్బందులు, రాష్ట్రంలో పరిస్థితులు మొదటి కొచ్చాయని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఎరువుల సమస్యలేదనుకున్నాం, కానీ ఇప్పుడు అదే ఎరువుల కోసం రైతులు చెప్పులు క్యూలో పెట్టిఎరువుల కోసం ప్రాణాలు తీసుకుంటున్న దుస్థితి మళ్లీ వచ్చిందన్నారు. పదేండ్లలో అచ్చంపేటలో అభివృద్ధి పనులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు వచ్చామని కానీ ఇప్పుడు ఇలాంటి సమావేశానికి వస్తామని అనుకోలేదన్నారు. బీఆర్ఎస్ అధికారం పోగానే కరెంట్ ఎప్పుడోస్తదో తెల్వదు, ఎరువులు ఎక్కడికిపోయాయి, ఈరోజు రైతు ఆపదలో ఆరఎకరం భూమి, ప్లాటు అమ్ముకుందామంటే కొనేదిక్కులేదు.
ఈ రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరన్నారు. అచ్చంపేటలో ప్రజలను ఆడగండని, ఓట్లువేసి తెచ్చుకున్న ప్రభుత్వంలో ఆస్తి విలువ ఎంత తగ్గిపోయిందో తెలుసుకోవాలన్నారు. బీఆర్ఎస్ రైతుల భూముల విలువ పెంచుకుంటుపోతే కాంగ్రెస్ తగ్గించుకుంటూ వచ్చిందన్నారు. నిన్న కాంగ్రెస్ ఢీల్లీకి వెళ్లి బీసీ రిజర్వేషన్ తెస్తున్నాం, అంతా అయిపోయింది, రాష్ట్రపతిని కలుస్తున్నాము అన్నా రు. కానీ రాహూల్‌గాంధీ రాలే, ఖర్గేరాలే, రాష్ట్రపతి అపాయిట్మెంట్ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికలకు వస్తారు, ఇక్కడున్న బీసీలు కాంగ్రెస్‌ను నిలదీయాలని పిలుపునిచ్చారు.
బీసీలలో ఏ కులానికి ఏం చేశారో చెప్పాలని నిలదీయాలని సూచించారు. రైతు ఆత్మహత్యలు ప్రారంభయయ్యాయి, బీసీలకు సున్నం పెట్టిండు, సోషల్ మీడియాలో వస్తే కేసు, గట్టిగా మాట్లాడితే కేసు, బెదిరింపులు మళ్లీ మొదటికొచ్చిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి గట్టిగా ఉండి కాం గ్రెస్‌కు బుద్ధి చెప్తే, కాంగ్రెస్‌లో వణుకుమొదలైతది, ఉన్నస్కీములైన కొనసాగిస్తారని, ప్రభుత్వాన్ని దించుతారనే భయంతో వళ్లు దగ్గరపెట్టుకొని పనిచేస్తారని చెప్పారు.
ఎవరికి ఏమి చెయ్యలే అబద్ధాల మీదనే ప్రభు త్వం పనిచేస్తుందన్నారు. మళ్లీ కాంగ్రెస్‌కు ఓటేస్తే సర్ధుకుంటారు.. లేకపోతే మర్చిపోయి కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉన్న పథకాలు బంద్ పెడతారని అన్నారు. అందరం అచ్చంపేటకు అండగా ఉంటాం, హైదరాబాద్‌లో దవాఖాన సమస్య ఉన్నా చెప్పండి సాయం చేస్తాం, కేసులు పెడితే చె ప్పండి అందరం వచ్చి కూర్చుంటాం, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
అచ్చంపేట వెనుకబడలేదని, చైతన్యంలో ముందుందని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. అచ్చంపేటకు నాయకుడు లేకున్నా ఇంత మొత్తంలో క్యాడర్ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉందన్నారు. అచ్చంపేట కార్యకర్తలకు అందరం సపోర్టుగా ఉంటామన్నారు. గతంలో రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని, బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పరిపాలన చేతగాక గత ప్రభుత్వం పదేండ్లలో ఏమిచేయలేదని విమర్శించేందుకు సిగ్గుండాలన్నారు. ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని, గత ప్రభుత్వాలు రైతులకు ఆత్మహత్యలకు పురిగొల్పారు అదే కేసిఆర్ హయంలో రైతులు సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు మళ్లీ రైతులు ఆత్మహత్యలకు పాల్పడడాన్ని బాధపడుతున్నామన్నారు. అందరికి శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీఅని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా పార్టీశ్రేణులు మరింత ఉత్సహంగా పనిచేయాలని సూచించారు.
అచ్చంపేటకు వచ్చాక బాధగా ఉంది, కార్యకర్తలను చూస్తుంటే ఆనందంగా ఉందని రాష్ట్ర బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. నల్లమల ప్రాంతంలో అక్షరాలుదిద్దిన ప్రాంతంలో పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం, ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగిందన్నారు. కా ంగ్రెస్ పార్టీ అడుగడుగునా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నా కార్యకర్తలు కేసీఆర్ వెంబడే ఉంటామని కదిలివచ్చారన్నారు. అచ్చంపేటను చూస్తే అనందంగా ఉందన్నారు. అచ్చంపేట నల్లమలలో పెద్దపులులు ఉంటాయి, కానీ కార్యకర్తలే పెద్దపులులుగా తరలివచ్చారని, గోడమీద పిల్లులుగా చూస్తున్న వారికి అచ్చంపేట సమావేశం వార్నింగ్ ఇస్తుందన్నారు. బాలరాజు ఒక్క ఓటమితో కుంగిపోతే ఎలా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం లేనిపోని అభండాలు వేసి కేసీఆర్, కేటీఆర్‌ను ఇబ్బందులు పెడుతుంటే ఇట్లాంటి పరిస్థితిలో కష్టకాలంలో కేసీఆర్ వైపు ఉండాల్సింది పోయి ఎవరి వద్దకు వెళ్లావు బాలరాజు అంటూ ప్రశ్నించారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పార్టీలోకి రావడం వల్లే గువ్వల బాలరాజు పార్టీ మారిండని చెప్పడంపై ఆర్ఎస్పీ క్లారీటి ఇచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణగా అభివృద్ధి చూపించారని, కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి పార్టీలోకి వెళ్లినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తానని చెప్పింది. కానీ వెళ్లలేదు.
నేను నాగర్‌కర్నూర్ పార్లమెంట్ సీటు అడుగలేదు, అధిష్ఠానం ఆలోచించి ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేయించాలో వారికి తెలుసని, నేను అడగలేదని, కేసీఆర్ వెళ్లమంటేనే తాను అభ్యర్థిగా వచ్చినట్లు చెప్పారు. నాస్వార్థం కోసం రాలేదు. బీఆర్ఎస్ ద్వారానే పేదలు, పీడితవర్గాల బతుకులు మారుతాయని నమ్మి రావడం జరిగిందని వివరించారు. ఏది ఏమైనా పార్టీ శ్రేణులు కాంగ్రెస్ మోసాలు ప్రజలకు చెప్పాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలిపిద్దామని కోరారు.
గువ్వల బాలరాజు రాజకీయ జీవితాన్ని ఆయనే బొందపెట్టుకుంటే మనతప్పుకాదని, ఎందుకు పార్టీ మారిండో తెలియదని అచ్చంపేట ఇన్చార్జి, నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. అచ్చంపేట సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఆదేశాల మేరకు అచ్చంపేటకు సమన్వయం చేసేందుకు ఇన్చార్జిగా రావడం జరిగిందన్నారు. మీరు, మేము కలిస్తే ఇక విజయం మనదేనన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకుందామన్నారు. గతంలో జరిగిన ఎన్నికలు మాదిరిగా రేపు ఎన్నికలు ఉండవని చాలా పకడ్బందీగా వెళ్లాల్సి ఉంటుందన్నారు.
మండలాల వారీగా, గ్రామాల వారీగా సమావేశాలు పెడతానని, గెలిచే వారినే నిలబెడతామని అన్నారు. ఎవరికి ఎలాంటి ఆపద, సమస్య ఉన్న నేరుగా నా దృష్టికి తీసుకురావాలని, నావల్ల పరిష్కారం కాకుంటే వేదికపైన ఉన్న వారి దృష్టికి తీసుకెళ్లి వాళ్లు కూడా బాధ్యత తీసుకునే విధంగా, కేవలం స్టేజీపైన మాట్లాడివెళ్లడం కాదు అండగా ఉండాలని కోరారు. ఏపార్టీ అయినా ఇప్పుడు అచ్చంపేట వైపు చూస్తుందని, అచ్చంపేట కార్యకర్తలు రాష్ర్టానికి ఆదర్శంగా నిలిచారన్నారు. నాయకుడు మారిన క్యాడర్ మారకుండా దేశానికి, రాష్ర్టానికి మార్గనిర్ధేశం చేశారని కొనియాడారు. మరో 20రోజుల్లో అచ్చంపేటకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తారని, భారీ కార్యకర్తల సమావేశం ఉంటుందని ప్రకటించారు. అనంతరం కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ అచ్చంపేటలోని కార్యకర్తలు, నాయకులను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత మాది అన్నారు.
కల్వకుర్తి, అచ్చంపేట కవల పిల్లలని, అందరం విభేదాలు లేకుండా శాయశక్తులా కలిసి పనిచేస్తే విజయం మనదేనన్నారు. తనతోపాటు మరికొందరు పార్టీ మారుతామని కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేయడాన్ని తప్పుబట్టారు. మేము రాజకీయాల్లోకి కొత్తగా రాలేదని, మేము రాజకీయంలో తలపండిన నాయకులం, మేము కేసీఆర్ నాయకత్వంతోనే ఉంటామని అన్నారు. పార్టీ మారాల్సిన అంతకర్మ మాకు పట్టలేదన్నారు. అచ్చంపేటలో పార్టీ పటిష్టంగా ఉందని, స్థానిక ఎన్నికల్లో గెలిపించుకోవాలని సూచించారు. ప్రజలు గ్రామాల్లో బీఆర్ఎస్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ అచ్చంపేటలో పార్టీబలంగా ఉందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ను గెలిపించేందుకు ఉత్సాహంతో ఉన్నారన్నారు. బాలరాజు ఎందుకు పార్టీ మారిండో ఆయనకే వదిలేద్దామని అన్నారు.
ఇక్కడి క్యాడర్‌కు ఎలాంటి అవసరం ఉన్నా పిలిస్తే వస్తానని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్త లు ధైర్యంతో ఉండాలని, ఎలాంటి ఆపద, సమస్య వచ్చినా తమకు తెలియజేస్తే అందరం కదిలివస్తామని అన్నారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ బాలరాజుకు పార్టీలో సముచిత స్థానం కల్పిం చిన పార్టీని నట్టేట ముంచి వెళ్లిపోయాడని మండిపడ్డారు. సమావేశంలో సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పోకల మనోహర్, మాకం తిరుపతయ్య, నర్సింహాగౌడ్, తులసీరాం, శ్రీకాంత్భీమా, ఎడ్మ సత్యం, పర్వతాలు, కరుణాకర్‌రావు, కేటీ తిరుపతయ్య, గోపాల్‌నాయక్, అమినొద్దీన్, గణేశ్‌రావు, నరేందర్‌రావు, గోపాల్‌రెడ్డి, రవీందర్రావు, కౌన్సిలర్లు, పీసీసీఎస్ చైర్మన్లు హన్మంత్‌రెడ్డి, నర్సయ్యయాదవ్, భూపాల్‌రావు, రాజిరెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చారు.