నారాయణపేట, నవంబర్ 13: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు అప్రజాస్వామికం, అనైతికమని బీఆర్ఎస్ నా రాయణపేట జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్‌రెడ్డి బుధవారం ఖండించారు. ఫార్మా కంపెనీ కి భూములు ఇవ్వడానికి ముందునుంచి కూ డా లగచర్ల, రోటిబండ తండా, పులిచర్ల తం డా, దుద్యాల, పోలేపల్లి, హకీంపేట గ్రామస్తు లు వ్యతిరేకిస్తూ వస్తున్నారని.. అందులో భా గంగానే ఆయా గ్రామాల రైతులు నాలుగు నె లలుగా నిద్రాహారాలు మాని స్వచ్ఛందంగా ధ ర్నాలు, ఆందోళనలు చేపట్టి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ఆయా సందర్భాల్లో ఒక ప్రజాప్రతినిధిగా, ఆ ప్రాంత మా జీ ఎమ్మెల్యేగా పట్నం నరేందర్‌రెడ్డి రైతులకు మద్దతు తెలిపి సంఘీభావం తెలియజేశారని, అంతేకాకుండా బాధితుల తరఫున పాదయా త్ర కూడా చేపట్టేందుకు శ్రీకారం చుడితే కాం గ్రెస్ ప్రభుత్వం ఒత్తిడితో పోలీసులు బలవంతంగా అడ్డుకొని ఠాణాకు తరలించి పాదయాత్రను భంగం చేశారని విమర్శించారు.
ఫార్మా కంపెనీ ఏర్పాటుతో భూములు కోల్పోయే వారి తరఫున పోరాట సమితి నాయకుడి కాల్ లిస్టులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి 42సార్లు మాట్లాడినట్లుగా కాంగ్రెస్ నాయకులు – పోలీసులు చెబుతూ, అధికారులపై దాడి కేసులో నరేందర్‌రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందులో భా గంగానే అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండానే సీఎం రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో పని చేస్తున్నారని ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గ ప్రజ ల్లో నరేందర్‌రెడ్డికి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేని ఫోర్ బ్రదర్స్ నయనా, భయనా బెదిరించి పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిం చి ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఉందని ఆరోపించారు.