నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 15 : మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డిని ఆదివారం గులాబీ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగంను హైదరాబాద్‌లోని ఆయ న స్వగృహానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గు వ్వల బాలరాజును గచ్చిబౌలిలోని ఆయన స్వగృహంలో మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. కుటుం బ సభ్యులతో ముచ్చటించారు. నాగర్‌కర్నూల్ జి ల్లాలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చే యడం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటా లు ఉధృతం చేయాలని కేటీఆర్ సూచించారు. ని త్యం ప్రజల్లో ఉండి స్థానిక సంస్థల్లో సత్తా చాటాలని సూచించారు.
కేటీఆర్ వెంట మాజీ మంత్రు లు శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బా ల్క సుమన్, రాకేశ్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చం ద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, బీగల గణేశ్‌గుప్తా, బీఆర్ఎస్ నే త నాగం శశిధర్‌రెడ్డి, అచ్చంపేట మాజీ మున్సిప ల్ చైర్మన్ నర్సింహాగౌడ్ తదితరులు ఉన్నారు.