మహబూబ్‌నగర్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : శనివారం రాష్ట్ర బంద్‌కు బీసీ సంఘాల జేఏసీ కార్యాచరణ రూపొందించింది. అన్ని బీసీ సంఘాలు ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ చేసేందుకు పిలుపునిచ్చాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేసి తీరాలని డిమా ండ్ చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చింది. వారి నిర్ణయానికి బీఆర్ఎస్తోపాటు పలు పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ మేరకు బంద్‌లో ఉమ్మడి పాలమూరులోని గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సహకరించాలని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు పిలుపునిచ్చారు.
కారు పార్టీ మద్దతు ఇవ్వగానే అన్ని పా ర్టీలు కూడా పాల్గొనాలని ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడే నిలిపివేయనున్నారు. వ్యాపార, వాణిజ్య, చిరు వ్యాపారులు, వి ద్యాసంస్థలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు పాల్గొని విజయవంతం చేస్తామని ప్రకటించారు. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. చట్టబద్ధత కల్పించకుండానే జీవో ఇచ్చి ఇటు సుప్రీం కోర్టులో.. అటు హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు కావడంతో కొత్త డ్రామాకు తెర తీశారని బీసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో శనివారం బంద్‌లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఆయా జిల్లా అధ్యక్షులు పిలుపునిచ్చారు. తెల్లవారుజామునే ఆర్టీసీ డిపోల వద్దకు వెళ్లి బస్సులు బయటికి రాకుండా ధర్నా చేపట్టాలని.. ఈ మేరకు ఆర్టీసీ కార్మికులు కూడా సహకరించేలా చూడాలని పార్టీ నేతలకు దిశా నిర్దే శం చేశారు. అలాగే వ్యాపార సంస్థలను మూసివేసే విధంగా చూడాలన్నారు. బీసీలకు జరిగిన అన్యాయంపై గ్రామగ్రామా ల్లో ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేసిన విషయాన్ని బీసీ సంఘాలతో కలిసి ఎలుగెత్తి చాటాలన్నారు. పోలీసుల అప్రమత్తం బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన రా ష్ట్ర వ్యాప్త బంద్ పిలుపుతో ఉమ్మడి జి ల్లా వ్యాప్తంగా పో లీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.
తోపాటు ఆయా జి ల్లాల్లో రాష్ట్ర సరిహద్దుల వెంట ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఆర్టీసీ బస్సులను తిరగనివ్వకుండా బీసీ సంఘాల జేఏసీ కార్యాచరణ రూపొందిస్తుండడంతో ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నది. డిపోలో వద్ద భద్రత ఏర్పాట్లు చేశారు. బీసీ సంఘాల జేఏసీకి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడంతో బంద్ ప్రశాంతంగా నిర్వహించేలా సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. అయితే మొత్తంపై బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన బంద్‌కు కాంగ్రెస్ కూడా మద్దతు పలకడంతో బీసీ సంఘాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మోసం చేసిందే కాంగ్రెస్ అయినప్పుడు బంద్‌లో ఎలా పాల్గొంటుందని నిలదీస్తున్నారు.
మరోవైపు బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ బంద్‌కు మద్దతు ఇవ్వడంతో బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రెండున్నర కోట్ల జనాభా ఉన్న బీసీలకు ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామ ని ఎన్నికల ముందు హస్తం పార్టీ హామీ ఇచ్చింది. నాడు కామారెడ్డిలో జరిగిన సమావేశంలోనూ ఈ మేరకు డిక్లరేషన్ ప్రకటించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది. చివరకు బీసీ రిజర్వేషన్ల మాటపై నిలబడకుండా.. చట్టబద్ధత ఇవ్వకుండా.. కేవలం ఇచ్చి చేతులు దులుపుకున్నది. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కూడా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినా హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. మళ్లీ ప్రభుత్వంలో ఉండి కూడా కొందరు కోర్టులకు పంపించి స్టే తీసుకొచ్చేలా చేసి డ్రామాలు ఆడారని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రిజర్వేషన్ల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ తీరును ఎండగట్టేందుకే బంద్‌కు పిలుపునిచ్చాయి.
కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీసీ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. బీసీ జనాభాకు ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పి ంచాల్సిన ప్రభుత్వం.. కావాలనే జీవోలు ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం చెందాయి. జీవోతో కోటా సా ధ్యం కాదని తెలిసినా హడావిడిగా నిర్ణయాలు తీసుకొన్నదని ఆరోపించాయి. ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగినా 42 శాతం రిజర్వేషన్లతో జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. రా జ్యాంగ బద్ధంగా ప్రయత్నం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని బీసీ సంఘాలు అంటున్నాయి. మా ఓటు మాకే అనే నినాదం ఇస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించి తీరాలని డిమాండ్ చేస్తున్నాయి.