BRS Protest | కాంగ్రెస్ 1000 రోజుల విఫలపాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ 1000 రోజుల వ్యవసాయ విధ్వంసంపై బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకుల పోరుబాట పట్టారు.
జిల్లాలోని అయిజ మండలం, సింధనూరు గ్రామ సమీపంలోని ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటర్ దగ్గర బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కుర్వ పల్లయ్య ఆధ్వర్యంలో రైతులతో బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకుల నిరసన చేపట్టారు. వెయ్యి రోజుల్లో రైతులకు చేసిన జలద్రోహం, ఆర్డీఎస్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక, ఏపీ రాష్ట్రాల జలదోపిడిని అరికట్టాలని, యూరియా కొరత,రైతు సంక్షేమానికి తూట్లు,సాగునీటి విషయంలో జల ద్రోహంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల విధ్వంస పాలనకు నిరసనగా నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రదర్శిస్తూ.. ప్ల కార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు.


Rashmika | భర్త విజయ్‌తో మూడు నెలల తర్వాత ఫుల్ క్వాలిటీ టైమ్.. నేచరే ఇలా చేసిందేమో ..
ACB | సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య నివాసంలో ఏసీబీ మెరుపు దాడులు