గద్వాల, ఏప్రిల్ 13: వరంగల్‌లో ఈనెల 27న జరిగే రజతోత్సవ సభకు గద్వాల నుంచి గులాబీ దళం కదం తొక్కి రావాలని స్పోర్ట్స్ అథారటీ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయడంలో భాగంగా యువజన విభాగం నాయకుడు రామకృష్ణ అధ్యక్షతన జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా గద్వాల నియోజకవర్గ నాయకులు బాసు హనుమంతు నాయుడుతో కలిసి హాజరై మాట్లాడారు.
రాష్ట్రంలో నడిగడ్డకు ప్రత్యేక స్థానం ఉందని.. పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. 27న జరిగే సభకు గద్వాల గడ్డ నుంచి తెలంగాణ అభిమానులు, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు భారీసంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. సభకు బయలుదేరే ముందు ఆయా వార్డులు, గ్రా మాల్లో బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించి బస్సు ల్లో తరలిరావాలని సూచించారు.
సభవిజయవంతం చేయడంలో మిగతా అన్ని నియోజకవర్గాల కంటే గద్వాల నియోజకవర్గం ముందుండాలని కోరారు. కేసీఆర్ 2001లో పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలంగాణ వచ్చేదాక ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. చంద్రబాబు సర్కారు తెలంగాణ ఏర్పాటుకు అడ్డుతగిలితే ఎదురించి పోరాడిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అన్నారు. రైతుల కష్టాలు తెలుసుకొని వాటిని తీర్చిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. తొలిముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో 1.60లక్షల ఉద్యోగాలు కల్పించారన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ర్టానికి 19వేల పరిశ్రమలు వచ్చాయన్నారు. ఐటీ రంగంలో అభివృద్ధి సాధించామన్నారు. బంగ్లా బస్సును కృష్ణానదిలో పారేయడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గద్వాల ప్రజలు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు.
కేసీఆర్ పానలలో జోగుళాంబ గద్వాల జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. రజతోత్సవ సభ అనంతరం పార్టీ అన్ని కమిటీలు ఏ ర్పాటు చేస్తుందని చెప్పారు. ప్రతి కార్యకర్త పార్టీకో సం పనిచేసి సభ విజయవంతానికి కృషి చేయాలని కోరారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గ నాయకుడు హనుమంతు నాయుడు మాట్లాడుతూ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న నాయకుడే నిజమైన నేత అన్నారు.
గద్వాల నియోజకవర్గంలో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని ఈ మూడేండ్లు కార్యకర్తలు సైనికుడిలా పార్టీకోసం పని చేయాలని కోరారు. సభకు తరళి వెళ్లడానికి అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. ఎవరూ అధై ర్య పడొద్దని.. కార్యకర్తలకు అండగా ఉంటానని చె ప్పారు. భవిష్యత్తరాలకు అండగా బీఆర్ఎస్ ఉం టుందని.. బీఆర్ఎస్ అమ్ముడుపోయే పార్టీ కాదని నిఖార్సయిన కార్యకర్తలు కలిగిన పార్టీ అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రవిప్రకాశ్‌గౌడ్, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, విష్ణువర్ధన్‌రెడ్డి, అంగడి బస్వరాజ్, కిశోర్, చక్రధర్‌రావు, రామకృష్ణ, కుర్వ పల్లయ్య, మల్లికార్జున, ముని, రాజు, శ్రీరాములు, తిరుమల్, రాము, శ్రీను పాల్గొన్నారు.