బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం పార్టీ 25ఏండ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని అన్ని గ్రామాలు, పట్టణాలు, మండలకేంద్రాల్లో జెండా పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు పార్టీ జెండాలను ఎగురవేశారు. అనంతరం వాహన శ్రేణులను జెండా ఊపి ప్రారంభించి ర్యాలీగా ఓరుగల్లుకు తరలివెళ్లారు.
జడ్చర్ల జాతీయ రహదారి వద్ద మహబూబ్‌నగర్, నారాయణపేట తదితర జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు మాజీ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. వరంగల్‌లో జిల్లాలో అట్టహాసంగా జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరువాడ అంతా ఒక్కటిగా వందలాది వాహనాల్లో తరలివెళ్లి పాలమూరు ప్రజానీకం అంతా కేసీఆర్‌కు బాసటగా నిలుస్తామని ప్రకటించారు.
– మహబూబ్‌నగర్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రజతోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. 25ఏండ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పల్లెలు, పట్టణాలు అన్న తేడాలేకుండా గులాబీ జెండా ఆదివారం రెపరెపలాడింది. అక్కడి నుంచి గులాబీ బాస్ కేసీఆర్ వరంగల్‌లో నిర్వహించిన రజతోత్సవ సభకు వివిధ వాహనాల్లో వేలాదిగా తరలివెళ్లారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నా రాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన వాహనాలన్నీ కిక్కిరిసిపోయాయి. చోటు లేక ఎక్కడికక్కడే ఆగిపోయా రు. కొంతమంది స్వచ్ఛందంగా అద్దెకు వాహనాలను తీసుకొని వెళ్లారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో గులాబీ జెండా ఎగురవేశారు.
అలంపూర్‌లో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, నారాయణపేటలో రా జేందర్‌రెడ్డి, జడ్చర్లలో లక్ష్మారెడ్డి, అచ్చంపేటలో గు వ్వల బాలరాజు, నాగర్‌కర్నూల్‌లో మర్రి జనార్దన్‌రెడ్డి, మక్తల్‌లో చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, దేవరకద్ర లో ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కల్వకుర్తిలో జైపాల్‌యాదవ్, కొడంగల్‌లో పట్నం నరేందర్‌రెడ్డి, కొల్లాపూర్‌లో బీరం హర్షవర్ధన్‌రెడ్డి, గద్వాలలో పార్టీ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు పార్టీ జెండాలను ఎగురవేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు రజతోత్సవ సభకు వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయగా, వాటిని వారు జెండా ఊపి ప్రారంభించారు.
భారత రాష్ట్ర సమితి 25ఏండ్ల ప్రాస్థానాన్ని పురస్కరించుకొని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. కొన్ని చోట్ల మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జెండా ఎగరవేయగా, మిగతా చోట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎగురవేశారు. అన్ని గ్రామాల్లో, మండల కేంద్రాల్లో జెండా పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా చు ట్టూ గులాబీ రంగులు వేసి శోభాయమానంగా తీర్చిదిద్దారు. అనంతరం కేసీఆర్ జిందాబాద్ అం టూ నినాదాలు చేశారు.
రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి 5వేల మంది వ రకు కార్యకర్తలను తరలించా రు. వరంగల్ దూరం కావడంతో కొన్ని ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి నుంచే కార్యకర్తలను తరలించారు. చాలా గ్రామాల్లో వచ్చిన వాహనాలన్నీ అప్పటికప్పుడే నిండిపోవడంతో అధినాయకత్వం సూచించిన మేరకే జన సమీకరణ చేస్తున్నామని చెప్పారు. అయినా కార్యకర్తలు వినకపోవడంతో కొంతమంది చా లామంది కార్యకర్తలు సొంత డబ్బులు పెట్టుకొని అద్దె వాహనాల్లో తరలివెళ్లారు.
రజతోత్సవ సభకు ఎంత మంది జనం వెళ్తున్నారు, ఎన్ని వాహనాలు వెళ్తున్నాయని మండలాల వారీగా ఇంటలీజెన్స్, పోలీస్ యం త్రాంగం ఆరా తీయడం కనిపించింది. ప్రతి మండల కేంద్రం నుంచి ఎన్ని వాహనాలు, ఎం తమంది వెళ్లారనేది లెక్క తీసి జిల్లా ఎస్పీకి పం పించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇం టలీజెన్స్, మఫ్టీ పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల పై నిఘా పెట్టి మరి వివరాలు సేకరించారు.
సో షల్ మీడియాలో వచ్చిన పోస్టులు, ఫొటోలను కూ డా నిశితంగా పరిశీలించి వాటిని అధికారుల కు పంపించినట్లు సమాచారం. అయితే అంచనాలకు మించి బీఆర్ఎస్ కార్యకర్తలు వరంగల్ సభ కు వెళ్లడం, సీఎం సొంత జిల్లా నుంచి ఊహించని విధంగా పెద్దఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివెళ్లడం షాక్‌కు గురిచేసింది. మొత్తంపై బీఆర్ఎస్ రజతోత్సవ సభ అంచనాలకు మించి సాగడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సహం కనిపించింది.
రజతోత్సవ సభ విజయవంతం కావడంతో ఉ మ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో గులాబీ కేడర్‌లో జోష్ పెరిగింది. ఉదయం నుంచి కార్యకర్తలు, నా యకులు బీఆర్ఎస్ సోషల్ మీడియాతో పాటు ఇ తర గ్రూపుల్లో చలో వరంగల్ సభకు వెళ్లే ఫొటోల ను షేర్ చేశారు. వరంగల్ సభకు చేరుకొని కేసీఆ ర్ స్పీచ్ విని కేరింతలు కొట్టారు. కేసీఆర్ స్పీచ్ ఫు ల్ జోష్ నింపింది. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కార్యకర్తలు ఘంటాపథంగా చెబుతున్నారు.