ఎన్నికల హామీలు అమలు చేయాలి
ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు కోరారు. దాడులే మీ లక్ష్యమైతే.. కాలమే సమాధానం చెబుతుందని కాంగ్రెస్ దాడులను ఉద్దేశించి పేర్కొన్నారు. సోమవారం అచ్చంపేటలోని తన నివాసంలో పార్టీ కార్యకర్తలు, విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
- బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు
అచ్చంపేటటౌన్, డిసెంబర్ 25 : ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు కోరారు. దాడులే మీ లక్ష్యమైతే.. కాలమే సమాధానం చెబుతుందని కాంగ్రెస్ దాడులను ఉద్దేశించి పేర్కొన్నారు. సోమవారం అచ్చంపేటలోని తన నివాసంలో పార్టీ కార్యకర్తలు, విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వివిధ అంశాలను ప్రస్తావిస్తూనే ఇ చ్చిన హామీలను నెరవేర్చే విషయంలో స్పష్టత ఇవ్వకుండా దాటవేసే ధోరణి అవలంభిస్తుందని ఆరోపించారు. కేసీఆర్ సర్కారు తీరును విమర్శించడమే కాదు చేసిన మంచి పనులను కూడా ప్రజలకు చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆటోడ్రైవర్లకు సమస్యలు తలెత్తుతున్నాయని, ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతో ఆశతో ప్రభుత్వానికి సహకరించారని, వారి డిమాండ్లు నెరవేర్చాల్సిన అవసరం ఉం దన్నారు.
నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకు లు, కార్యకర్తలు అండగా ఉన్నటువంటి వారు ధైర్యా న్ని కోల్పొవద్దని, తెలంగా ణ ఉద్యమంలో ఏవిధంగా అయితే పొరాటాన్ని సాగించామో అదేపంథాలో రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం పాటు పడదామని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఎన్నో సార్లు తనను ఇక్కడి నుంచి తరుము తాం, బొంద పెడతామని మాట్లాడడం జరిగిందని, కానీ ఏరోజు వారిపై పగ తీర్చుకోవాలనుకోలేదన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే వం శీకృష్ణ తన అనుచర గణంతో నాపై దాడి చేసిం డు అందుకే ఆ కేసు విచారణలో ఉన్నది. ఆ విషయమై నేను ఒక ప్రసంగంలో రాజీపడితే తప్పా నా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్లలేవు అనే మాటలను వక్రీకరిస్తున్నారన్నారు. మీరు ప్రవర్తించే తీరు ప్రజాస్వామ్యానికే కలంకం తెచ్చేలా ఉందని సరిచేసుకోవాలని హితవుపలికారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహాగౌడ్, తులసీరాం, అమీనొద్దీన్, శ్రీధతోపాటు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

