మహబూబ్‌నగర్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలకు మొత్తం 76మంది అభ్యర్థులు నామినేషన్లు దా ఖలు చేశారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి 42మంది, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానానికి 36 మంది నామినేషన్లు వేశారు.
కాగా చివరిరోజు పాలమూరులో 22మంది, కందనూలులో 19మంది నా మినేషన్లు దాఖలు చేశారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి మ న్నె శ్రీనివాస్‌రెడ్డి తన నామినేషన్ పత్రాలను గురువా రం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎ మ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రె డ్డి, రాజేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్ ఉన్నారు.