అలంపూర్ చౌరస్తా, డిసెంబర్ 23 : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతిని పురస్కరించుకొని సోమవా రం హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో పీవీ చిత్రపటానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆహ్వానం మేరకు ఎమ్మెల్సీ కవితతోపాటు ఎమ్మెల్యే విజయుడు నివాళులర్పించారు. అలాగే తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి విజయుడు కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు.
అలంపూర్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎందరో క్రీడాకారులు ఉన్నా సరైన క్రీ డా ప్రాంగణాలు, సౌకర్యాలు లేకపోవడంతో క్రీడలకు దూరమయ్యే పరిస్థితి ఉన్నదన్నారు. వివిధ క్రీడా పో టీల్లో నియోజకవర్గ విద్యార్థి, విద్యార్థులు ప్రతిభ కనబర్చుతున్నారని, సౌకర్యాలు కల్పిస్తే మరింత రాణిస్తారని విన్నవించారు. అలంపూర్ క్రీడాభివృద్ధికి తోడ్పాటునందించాలని, మండల కేంద్రానికి మినీ స్టేడియం నిర్మించాలని, స్పోర్ట్స్‌కు నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనికి ఆయన తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.