ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే దాడులా?
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న కాంగ్రెస్ సోషల్ మీడియా నాయకుడు రమేశ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజనగరం ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
- వ్యక్తిగత దూషణలు చేస్తున్న కాంగ్రెస్ నేతపై చర్యలు తీసుకోవాలి
- వనపర్తిలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
వనపర్తి టౌన్, ఆగస్టు 17 : ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న కాంగ్రెస్ సోషల్ మీడియా నాయకుడు రమేశ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజనగరం ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం సోషల్ మీడియాలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్పై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ పోస్టులు పెట్టి అవహేళన చేసిన రమేశ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
రాజనగరంలో గుడి వద్ద మా ట్లాడుదామని గ్రామస్తులు రాగా, అంబటి రమేశ్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకొని దమ్ముంటే ఇక్కడికి రావాలని సవాల్ విసిరినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్లగా అక్కడ వాగ్వివాదం చోటుచేసుకున్నది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులను, బీఆర్ఎస్ నాయకులను నిలువరించారు.
అనంతరం గ్రామస్తు లు, బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, మాజీ మార్క్‌ఫెడ్ చైర్మన్ విజయ్, జిల్లా అదికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ సోషల్ మీడియా ముసుగులో ప్రశ్నించే నాయకులను టా ర్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్న ఎమ్మెల్యే అ నుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎ మ్మెల్యే మేఘారెడ్డి వేతనాలు ఇస్తూ వారిని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు.
కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పెయిడ్ ఆర్టిస్ట్‌లను ఎమ్మెల్యే పోషించడం ఎంత వరకు సమంజసమన్నారు. గతంలో మాజీ మంత్రి సింగిరెడ్డి ని రంజన్‌రెడ్డి స్వయంగా నాయకులతో కలిసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారని, ఎస్పీ సూచనల మేరకు సమన్వయం పాటించమని చెప్పడంతో చట్టంపై గౌరవం ఉంచి మౌనంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు సైతం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు.
పోలీసుల చర్యలు అధికార పార్టీకి వ త్తాసు ప లికేలా ఉన్నాయని ఆరోపించారు. అంబటి రమేశ్‌పై చర్య లు తీసుకోకపోతే ఎమ్మెల్యే సోషల్ మీడియా ద్వా రా ప్రేరేపిస్తున్నట్లు భావించాల్సి వస్తుందని స్పష్టం చేశా రు. తక్షణమే ఎమ్మెల్యే జోక్యం చేసుకొని రమేశ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, రాము, అశోక్, కరుణాకర్, అంజి, వెం కటయ్య, బాలస్వామి, గోపాల్, గిరి, యుగంధర్‌రెడ్డి, హు స్సేన్, బాలచంద్రయ్య తదితరులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

