పెబ్బేరు, ఆగస్టు 4 : పెబ్బేరు పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. స్థానిక సుభాష్చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. వనపర్తి ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేస్తామని చెప్పి మూడేైళ్లెనా ఇంకా మొద లు పెట్టకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశా రు. ప నులు పూర్తి చేయకపోవడంతో పాటు నిర్వాసితులను పట్టించుకోనందున ఎమ్మెల్యే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాం డ్ చేశారు. ప్రయాణికుల సౌకర్యం కో సం బీఆర్ఎస్ హయాంలో నిధు లు మంజూరు చేస్తూ పనులు చేపట్టారని అన్నారు.
ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ పనుల జోలికి వెళ్లకపోవడంతో ఇటు ప్రయాణికు లు, అటు విస్తరణలో ఆస్తులు కోల్పోయిన బాధితులకు న్యాయం జరగలేదన్నారు. మున్సిపల్ కమిషనర్ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భం గా పోలీసులు ఆందోళనను విరమింపజేసేందుకు ప్రయత్నించగా వారికి, ఆందోళనకారులకు వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై వెంకటేశ్వరగౌడ్ పలువురు నాయకులకు అదుపులోకి తీసుకొని తర్వాత వదిలి వేశారు.
పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు దిలీప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, మాజీ వైస్ చైర్మన్ కర్రెస్వామి, కౌన్సిలర్లు శంకర్‌నాయుడు, మన్యం, నాయకులు ఎల్లారెడ్డి, సహదేవుడు, సాయిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, భారతి పాల్గొన్నారు.