ఒకప్పుడు చీర కొంగును అందంగా నిలబెట్టేందుకు వాడిన బ్రూచ్ ఇప్పుడు ఫ్యాషన్లో మళ్లీ మెరుస్తున్నది. అయితే ఈసారి దాని స్థానం కొంగుకే పరిమితం కాదు. నయా ఫ్యాషన్లో బ్రూచ్లు కొత్త రూపాల్లో కనిపిస్తున్నాయి. చొక్కా కాలర్, జాకెట్ పైభాగం, స్కార్ఫ్ ముడి, కోట్ లేదా చీర అంచుపై ఒక్క బ్రూచ్ చాలు… సాధారణ దుస్తులకూ ప్రత్యేకత వస్తుంది. పూల ఆకారాలు, ముత్యాల అలంకరణలు, పాతకాలపు నగల స్ఫూర్తితో రూపొందిన నమూనాలకు ఆదరణ పెరుగుతున్నది.
ఇందులో మరో ఆసక్తికరమైన మార్పు… ఒకటికి బదులు రెండు, మూడు చిన్న బ్రూచ్లని కలిపి ధరించడం. పాత నగల్లోని చిన్న అలంకరణలను కూడా ఇలా కొత్తగా ఉపయోగించుకోవచ్చు. సాధారణ కుర్తాకు రంగురంగుల బ్రూచ్, చీరకు సంప్రదాయ నమూనా, జాకెట్కు పెద్ద ఆకర్షణీయమైన బ్రూచ్ ఎంచుకుంటే లుక్ మారిపోతుంది. దుస్తులు మార్చకుండానే కొత్త రూపాన్ని ఇచ్చే ఈ చిన్న అలంకరణ… ఈ సీజన్లో పర్సనల్ ైస్టెలింగ్కి పెద్ద గుర్తుగా మారుతున్నది.