ఎంజీఎం దవాఖానకు నిధులు ఖర్చు చేస్తలే
వరంగల్ ఎంజీఎం దవాఖానకు నిధులు ఖర్చు చేయడంలేదని కాంగ్రెస్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అంగీకరించారు. త్వరలోనే వరంగల్ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం అవుతుంది కదా.. అందుకే నిధులు ఖర్చు చేయడంలేదని పేర్కొన్నారు.
- దవాఖాన దుస్థితికి కొందరు వైద్యుల నిర్లక్ష్యమూ కారణమే
- కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 22 : వరంగల్ ఎంజీఎం దవాఖానకు నిధులు ఖర్చు చేయడంలేదని కాంగ్రెస్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అంగీకరించారు. త్వరలోనే వరంగల్ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం అవుతుంది కదా.. అందుకే నిధులు ఖర్చు చేయడంలేదని పేర్కొన్నారు. అందుకే ఎంజీఎం దవాఖానకు ఈ దుస్థితి పట్టిందన్నారు. మంగళవారం ఆయన హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. వరంగల్ ఎంజీఎం దవాఖాన శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతున్నాయని, దవాఖానకు కావాల్సిన వసతులు, సౌకర్యాలు కల్పించడంలేదని, నిధులు ఖర్చు చేయడంలేదని పేర్కొన్నారు.
వచ్చేనెల సీఎం రేవంత్ చేతుల మీదుగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. కొందరు డాక్టర్ల స్వార్థంతో ఎంజీఎం నిర్లక్ష్యానికి గురవుతున్నదని, దవాఖానలో వైద్యు లు అందుబాటులో ఉండటంలేదని విస్మయం వ్యక్తంచేశారు. గతంలో ఇన్స్పెక్షన్ చేసినప్పుడు.. వైద్యులు రావడంలేదని, ప్రైవేట్ క్లినిక్‌లోనే ఎక్కువగా ఉంటున్నారనే విషయాన్ని గుర్తించినట్టు చెప్పారు. ప్రస్తుతం ప్రారంభించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇలాంటి పొరపాట్లు జరుగకుండా స్పెషల్ ఆఫీసర్‌గా ఒక ఐఏఎస్‌ను నియమించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

