మదనాపురం, అక్టోబర్ 9 : రాష్ట్రంలో కాంగ్రెస్ రాక్షస పాలన నడుస్తున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీని కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కోసం భూ సేకరణను వ్యతిరేకిస్తూ బుధవారం రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు పాదయాత్రకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో యాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి వికారాబాద్ జిల్లా తుంకిమెట్ల వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరిలో పట్నం, నవీన్‌కుమార్‌ను పోలీసులు కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకొన్న మాజీ మం త్రితోపాటు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పీఎస్‌కు వెళ్లి అరెస్టయిన నేతలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల పక్షాన నిలబడి పాదయాత్ర చేస్తున్న నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. కార్పొరేట్ వ్యవస్థతో కుమ్మక్కై సీఎం రేవంత్‌రెడ్డి రైతులను నిలువునా ముంచుతున్నారన్నారు.
ఎన్ని నిర్బంధాలు చేసినా ప్రజలు, కర్షకుల పక్షాన నిలబడి పో రాటం చేస్తామని హెచ్చరించారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు బుద్ధి తెచ్చుకొని బీఆర్ఎస్పై అక్కసు వెళ్లగక్కకుండా ప్రజల మేలుకోసం పనిచేయాలని హిత వు పలికారు. పోరాటాలు మాకు కొత్త కావన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, మాజీ ఎంపీపీ గుంత మౌనిక, బీఆర్ఎస్ నాయకులు విశ్వేశ్వర్, చెన్నకేశవరెడ్డి, గాడిల ప్రశాం త్, నందిమళ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.