మహబూబ్నగర్ : చలో కర్ణాటక కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు భారీగా తరలి వెళ్లారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుంచి మాజీ మంత్రలు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు చిట్టెం రామ్మోహన్ రెడ్డి అల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్, పార్టీ నేతలు ఇంతియాజ్ ఇసాక్, వెంకటేశ్వర్ రెడ్డి లతో పాటు భారీ కాన్వాయ్ తో బయలు దేరారు.
కర్నాటక అక్రమ బ్యారేజీలను తొలగించాలని కొత్తగా కట్టే వాటిని ఆపాలని డిమాండ్ చేశారు. కృష్ణ, తుంగభద్ర, బీమా నదుల జలాలు కర్నాటక, ఏపీ దోచుకుంటున్నాయి. బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా దీనిపై పోరాటానికి సిద్ధంగా ఉందన్నారు.