కోస్గి(మద్దూరు), అక్టోబర్ 9 : ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం తమ భూములు దిగమింగొద్దని రైతులు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటును రద్దు చేయాలంటూ బుధవారం వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మ ఆలయం నుంచి మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే, ఉదయం 8 గంటలకే బీఆర్ఎస్ నాయకులు, ఫార్మా బాధిత రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి పోలేపల్లి ఆలయానికి వస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని బొంరాస్‌పేట్ మండలం తుంకిమెట్ల గేట్ సమీపంలో అరెస్ట్ చేసి కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
విషయం తెలుసుకున్న రైతులు, బీఆర్ఎస్ నాయకులు పోలేపల్లి ఆల యం నుంచి హకీంపేట్ వైపు పాదయాత్ర ప్రారంభించారు. కాగా, హకీంపేట్ వద్ద బారికేడ్లు పెట్టి పా దయాత్ర చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. బారికెడ్లను తోసుకుంటూ వెళ్లి హకీంపేట్ చౌరస్తా లో ధర్నా నిర్వహించారు. సీఎం డౌన్‌డౌన్.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం, గోబ్యా క్ ఫార్మా.. అంటూ నినాదాలు చేశారు. రెండు గంటలపాటు ఆందోళన చేపట్టడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. నిరసనలో పలువురు నాయకులు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిని కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిపిస్తేనే ముఖ్యమంత్రి అయ్యారన్నా రు. అయితే, మా పొట్ట కొట్టేందుకు ఇక్కడికి ఫార్మా కంపెనీలు తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు.
ఫార్మా కంపెనీని వేరే చోటుకు తరలించే వరకు పోరాటం ఆగదన్నారు. 29రోజులుగా రిలే నిరాహా ర దీక్షలు చేస్తున్నా.. ముఖ్యమంత్రి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములను ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. కేసీఆర్ సారు తమను కాపాడాలని వేడుకున్నారు. విష యం తెలుసుకున్న నారాయణపేట ఎస్పీ యోగేశ్‌గౌతమ్ అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో మా ట్లాడారు. శాంతిభద్రతల రీత్యా ఇబ్బంది కలుగుతుందని, డిమాండ్లను చెబితే ఉన్నతాధికారులకు పంపిస్తామని చెప్పారు. సర్ధిచెప్పినా వినకపోవడం తో పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి పంపించారు.
అనంతరం ధర్నా వద్దకు చేరుకున్న తాసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. సాయం త్రం కొత్తకోట పోలీస్‌స్టేషన్ నుంచి సొంతపూచీకత్తుపై మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని విడిచిపెట్టా రు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ శాసం రామకృష్ణ, నాయకులు వెంకట్ న ర్సింహులు, కోట్ల మైపాల్, సలీం, సురేశ్, యాద గి రి, బసప్ప, రాజ్, బుగ్గప్ప, శ్రీను, రాజునాయక్, గోపాల్‌నాయక్, జనార్దన్‌రెడ్డి, నెహ్రూనాయక్, సా యప్ప, శివకుమార్‌తోపాటు రైతులు పాల్గొన్నారు.