పెంట్లవెల్లి, జూన్ 1 : ‘డంపింగ్ యార్డులా…బస్టాండ్’ అనే శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో బస్టాండ్ దుస్థితిపై ఆదివారం వార్త కథనం ప్రచురించింది. ఈ వార్తకు స్పందిస్తూ..పెంట్లవెల్లి గ్రామ యువకుడు మే ఘరాజు బస్టాండ్ ఆవరణలో ఆదివారం టెంట్ వేసుకొని తన తల్లి చేతుల మీ దుగా పూలమాల వేయించుకొని నిరాహార దీక్ష చేపట్టాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 28 ఏండ్లుగా బస్టాండ్ వినియోగంలో లేక ప్ర యాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఆర్టీసీ అధికారులకు ఎన్ని మార్లు విన్నవించినా స్పందించకపోవడం విడ్డూరమన్నారు.
శాంతి యు తంగా బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగ బద్ధంగా మండల ప్రజలకు బస్టాండ్‌ను వినియోగంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో నేను నిరాహార దీక్ష చేస్తూంటే.. కొందరు అధికార పార్టీ నాయకులు జీర్ణించుకోలేక దీక్షను భగ్నం చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. చివరకు పో లీసులతో నిరాహార దీక్ష విరమించాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆయన తె లిపారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా పెంట్లవెల్లి బస్టాండ్‌ను వినియోగంలోకి తీసుకొచ్చే వరకు దీక్షను విరమించేది లేదని ఆయన పేర్కొన్నారు.
గ్రామ యువకుడు మేఘరాజు చేపట్టిన నిరాహార దీక్షకు తొలిరోజు రహదారిపై వెళ్లే ప్రయాణికులు, పట్టణానికి చెందిన యువకులు, మేధావులతో పాటు, బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోవు రాజు పెద్ద ఎత్తున మద్దతు తెలిపా రు. ఈ సందర్భంగా గోవు రాజు మాట్లాడుతూ బస్టాండ్ నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా బస్టాండ్‌లోకి వెళ్ల లేదంటే ఆర్టీసీ అధికారులు ఎంత మొద్దు నిద్రలో ఉన్నారో ఇట్టే అ ర్థమవుతుందని ఆయన ఎద్దేవా చేశారు.
ఇప్పటికైనా ఆర్టీసీ ఆధికారులు స్పందించి బస్టాండ్‌ని వినియోగంలోకి తీసుకురా వాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు గ్రామ యువకుడు చేపట్టిన నిరాహార దీక్షకు బీఆర్ఎస్ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ దీక్ష శిబిరంలో గ్రామ యువకులు అక్బర్, మహ్మదుల్లా, యాసిన్, ఫిరోజ్‌ఖాన్, చెన్నకేశవ్, గోవు వెంకీ, ప్రయాణికులు లక్ష్మీదేవమ్మ, మణెమ్మ పాల్గొన్నారు.