గద్వాల, జూన్ 14 : ప్రజలు ఛీకొట్టినా సిగ్గులేకుండా చిల్లర రాజకీయాలు చేస్తూ రైతుల పొట్టకొట్టడం మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌కు తగదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత విజయ్‌కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇ థనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టొద్దని ఆందోళన చేసిన రైతులను పోలీసులు జైలుకు పం పితే పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గతంలో నీకు ఓట్లు వేసి రాజకీయ బిక్ష పెట్టిన రాజోళి మండలంలోని ఏ గ్రామానికైనా వెళ్లే దమ్ముందా? అని ఆయన సవాల్ విసిరారు.
త్వరలోనే సంపత్‌కుమార్ భూములు, ఇసు క, మైనింగ్ మాఫియా గురించి బయట పెడతామన్నారు. నడిగడ్డలో చేస్తున్న అరాచాకాలన్నీ పింక్ బుక్‌లో రాస్తున్నామని, పూర్తి స్థా యిలో విచారణ జరిపించి, నష్టపోయిన ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. సీడ్ పత్తి రైతు ల సమస్యలను రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్‌కు వివరించడానికి వెళ్తే అక్రమంగా అరెస్ట్ చేయిస్తారా అంటూ ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే సీడ్ కంపెనీలకు, ఆర్గనైజర్లకు గద్వాల జిల్లా కాంగ్రెస్ నాయకులు అమ్ముడుపోయారని అర్థమవుతున్నదని ఆరోపించారు. ము ఠాగా ఏర్పడి రైతులను నిలువునా ముంచుతున్నారని మండిపడ్డారు.
రైతులకు జరుగుతున్న మోసాలను రైతు కమిషన్ దృష్టికి తీసుకెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షు డు నల్లారెడ్డి, నాయకులు పర్యటనను తప్పుదోవ పట్టించారన్నారు. సమస్యలున్న గట్టు, ధరూర్, కేటీదొడ్డి, మల్దకల్ మండలాల్లో ప ర్యటించకుండా సంబంధం లేని పుటాన్పల్లికి షెడ్యూల్ మార్చారన్నారు. సంబంధం లే కుండా మాజీ ఎమ్మెల్యే సంపత్‌కు పుటాన్పల్లికి వచ్చాడని, అతడి వల్లే గొడవ జరిగిందన్నారు. గొడవ చేసిన కాంగ్రెసోళ్లను వదిలి రై తు సమస్యలు లేవనెత్తిన మమ్మల్ని, కమిషన్ ఎదుట వాదనలు వినిపించకుండా అక్రమ ంగా అరెస్ట్ చేశారన్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే పోరాటం చేస్తామన్నారు.