కృష్ణ, జూన్ 24 : రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో జూన్ 25 నుంచి 27వ తేదీ వరకు నెవ్స్కీ అంతర్జాతీయ పర్యావరణ కాంగ్రెస్ -2026 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఇందులో భారత్ తరపున ప్రతినిధి సభ్యుడిగా కృష్ణ మండలం గుర్జాలకు చెందిన బీఆర్ఎస్ యువ నేత శివరాజ్ పాటిల్ ఎంపికయ్యాడు. ప్రస్తుతం కర్ణాటకలోని రాయిచూర్లోని ఉంటూ విద్యారంగంలో రాణిస్తున్నారు.
ఆతిథ్య (హాస్పిటాలిటీ), విద్యా రంగంలో వ్యాపారవేత్తగా కొనసాగుతున్న తనకు ‘పాత్నే గ్లోబల్ అలయన్స్ ప్రతినిధి బృందం తరఫున అంతర్జాతీయ వేదికపై ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కడం విశిష్టమైన ఘట్టంగా భావిస్తున్నట్లు ఒక ప్రకటనలో శివరాజ్ తెలిపాడు. ఈ గొప్ప అవకాశాన్ని కల్పి ంచిన దేశ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.