కేశంపేట : రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని బీఆర్ఎస్ నాయకుడు నిరుపేద వధువుకు పుస్తె, మెట్టలను అందజేసి ఔదర్యాన్ని చాటుకున్నారు. మండలంలోని పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన అబ్బి మల్లయ్య, సుగుణ దంపతుల కుమార్తె కీర్తన వివాహం సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ( BRS Leader ) పల్లాటి లక్ష్మీనారాయణ ( Lakshminarayana), కవిత( Kavitha) దంపతులు శుక్రవారం పుస్తె ,మెట్టలను అందజేశారు. పేద కుటుంబానికి సహాయం చేసిన బీఆర్ఎస్ నాయకులు గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో చెన్నయ్య, రాఘవేందర్, మారతమ్మ, రామకృష్ణ, రాంకొండల్, శ్రీశైలం, రవి, రామస్వామి, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.