మరో 45 రోజులు సాగునీరివ్వాలి
కృష్ణ్ణా బేసిన్ పరిధిలోని ఉమ్మడి పాలమూరుతోపాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు కృష్ణానది నీళ్ల ద్వారానే సాగు, తాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
- కృష్ణా బేసిన్ ఆధారంగానే నాలుగు జిల్లాలకు సాగునీటి ఉపయోగం
- రైతుల మధ్య నీటి చిచ్చు పెట్టొద్దు
- శ్రీశైలం జలాశయంలోని నీటిని సద్వినియోగం చేసుకోవాలి
- మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి గుడిపల్లి రిజర్వాయర్ సందర్శన
వనపర్తి, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : కృష్ణ్ణా బేసిన్ పరిధిలోని ఉమ్మడి పాలమూరుతోపాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు కృష్ణానది నీళ్ల ద్వారానే సాగు, తాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ లక్ష్యం మేరకు సాగునీటి వనరులను అభివృద్ధి చేశారని, ఇప్పటికీ మా లక్ష్యం అదేనని స్పష్టం చేశారు. మంగళవారం ఎంజీకేఎల్ఐ పరిధిలోని మూడో లిఫ్ట్ అయిన గుడిపల్లి రిజర్వాయర్‌ను నిరంజన్‌రెడ్డి పలువురు రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం అక్క డే మీడియాతో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణానది బేసిన్లో ఉన్న ప్రాంతాలకు పుష్కలంగా సాగునీరు, తాగునీరందాలంటే అందుకు అనువు గా ఉందని మాజీ సీఎం కేసీఆర్ గుర్తించారన్నా రు. అదే లక్ష్యం మేర కు పదేళ్ల బీ ఆర్ఎస్ పాలనలో అత్యం త ప్రా ధాన్యత క్రమంలో సాగునీటి రం గానికి ప్రాధాన్యం ఇచ్చారు.
శ్రీశైలం రిజర్వాయర్‌లోని ప్రతినీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో ని ఆయకట్టుకు సహితం ఇప్పటి వరకు జలకళ ఉండగా, జూరాల ఆయకట్టుకు క్రాఫ్ హాలీడే ప్రకటించారని ఆయ న గుర్తు చేశారు. ఎంజీకేఎల్ఐ పరిధిలోని అన్ని ప్రాంతాలకు సమానంగా సాగునీరు అందించాలని, ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఒక ప్రాంతానికి ఎక్కువ, మరో ప్రాంతానికి తక్కువ నీటిని విడుదల చేసి రైతుల మధ్య చిచ్చు పెట్టొద్దన్నారు. ఎంజీకేఎల్ఐ పథకంలో 240 రోజుల పాటు మోటర్ల ద్వారా సాగునీటిని పంపింగ్ చేస్తున్నారని చెప్పా రు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సహితం అదే ఉద్దేశంతోనే చేపట్టడం జరిగిందని, శ్రీశైలంలో బురద వచ్చే వరకు నీటిని తోడుకునే వెసలుబాటు ఉంటుందన్నారు. డెడ్‌స్టోరేజ్ వరకు నీటిని పంపింగ్ చేయవచ్చని, అలాకాకుండా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును జూరాలపై చేపడితే సాగునీరు అనుకున్నంతలో తీసుకోవడం ఎట్టిపరిస్థితిలోనూ సాధ్యపడదన్నారు.
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 45 రోజుల్లో 90 టీఎంసీల నీటిని తీసుకునే అవకాశం ఉందన్నారు. ఎలాంటి నీళ్ల సోర్స్ లేనిచోట పాలమూరు-రంగారెడ్డిని ఏర్పాటు చేయాలని కోరడం వారి అవగాహన రాహిత్యమన్నారు. పుష్కలంగా నీళ్లుండే శ్రీశైలంను ఆంధ్రాకు ధారాధత్తం చేయడం కోసం అలా మాట్లాడుతున్నారని, అదే ఉద్దేశంతోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ సర్కార్ పడావు పెట్టిందని ఆరోపించారు. అసంపూర్తిగా ఉన్న ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టుకు మాజీ సీఎం కేసీఆర్ రూ.3వేల కోట్లు వెచ్చించి వినియోగంలోకి తేవడం వల్ల నేడు ఉమ్మడి పాలమూరులో అన్ని వనరుల నుంచి దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని చెప్పారు.
ఇంకాను ఉమ్మడి జిల్లాలో మిగిలిన 35 లక్షల ఎకరాల సాగుభూమి ఉందని, ఈ భూములకు నీరివ్వడం కోసమే సమృద్ధిగా నీరుండే శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి నీటి సేకరణ జరిపే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు. 27 వేల ఎకరాల భూసేకరణ, రూ.32 వేల కోట్ల పనులు చేసి రూ.27 వేల కోట్ల బిల్లులను సహితం చెల్లించి నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. నిత్యం పాలమూరు బిడ్డగా చెబుతున్న సీఎం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తూ సొంత జిల్లా రైతులను మోసం చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, భీమయ్య, సురేందర్‌రెడ్డి, శివరాంరెడ్డి, అశోక్‌కుమార్, మధుసూదన్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, పృథ్వీరాజ్, రాములు, మాణిక్యం, తిరుపతయ్య, వేణు యాదవ్, మురళీసాగర్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, గిరి, ఇమ్రాన్, హేమంత్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

