గద్వాల,జూన్ 13 : విత్తన పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కంపెనీలు, ఆర్గనైజర్లు రైతులు పండించిన సీడ్ విత్తనాలు పాస్ అయిన ఫెయిల్ అయినట్లు చూయిస్తూ రైతులను మోసం చేస్తున్న విషయాలను గత వారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుర్వ విజయ్‌కుమార్ హైదరబాద్‌లో మాజీ మంత్రులు, హరీశ్‌రావు, కేటీఆర్‌తోపాటు, రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి వినతి పత్రం అందజేయడంతోపాటు, రైతులకు జరుగుతున్న అన్యాయాలను వారికి వివరించారు. అందుకు స్పందించి రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి జిల్లాలో రైతులు సాగు చేసిన సీడ్ పత్తి పంటను పరిశీలించడంతో, రైతుల సమస్యలు వినడానికి శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చారు.
ముందుగా గద్వాల మండలం పుటాన్పల్లి గ్రామంలో కోటేశ్వర్‌రెడ్డి అనే రైతుతో కలెక్టర్ సంతోష్ మాట్లాడిన అనంతరం కమిషన్ చైర్మన్ అక్కడ రైతులు సాగు చేసిన పత్తి పంటను కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్‌కు చెందిన సీడ్ ఆర్గనైజర్లు, రైతులతో మాట్లాడ నివ్వకుండా ఆర్గనైజర్లే సమస్యలను వివరిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజయ్‌కుమార్ సీడ్ పత్తి రైతుల సమస్యలు ఒక చోట ఉంటే మరొక చోట ఎలా చూయిస్తారని, సమ స్య ఉన్న చోటకు వెళ్దామని కమిషన్ చైర్మన్‌తో మాట్లాడుతుండగా కాంగ్రెస్‌కు చెందిన కొంత మంది నాయకులకు, బీఆర్ఎస్ నేత విజయ్‌కుమార్ మధ్య మాటలు యుద్ధం నెలకొంది.
దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాలను శాంతిప జేశాయి. రైతు కమిషన్ చైర్మన్ పంట పొలాలను పరిశీలించకుండానే అక్కడ నుంచి వెళ్లి పోయారు. రైతు కమిషన్ చైర్మన్‌తో కలిసి కలెక్టరేట్‌కు విజయ్‌కుమార్ వెళ్లే సమయంలో అతనిని బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసి రేవులపల్లి పో లీస్ స్టేషన్‌కు తరలించారు. గొడవకు కారణమైనా కాంగ్రె స్ నాయకులను మాత్రం పోలీసులు వదిలి పెట్టారు.
తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న మల్ధకల్ మండలానికి చెందిన రైతును పోలీసులు మెడ బట్టి తోసుకుంటూ తమ వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రైతుల బాధలు చెప్పకుండానే, సమస్యలు వినకుండానే అన్యాయంగా అరెస్ట్ చేయడం కాం గ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానానికి నిదర్శనమని రైతులు మండిపడ్డారు. ప్రజల పక్షాన పోరాడే వారిపై అ క్రమ అరెస్ట్‌లు, దౌర్జన్యాలు కాంగ్రెస్ పాలనలో సర్వ సాధారణ మయ్యాయని రైతులు పోలీసుల, ప్రభుత్వ తీరు పై ఆగ్రహాం వ్యక్తం చేశారు. కమిషన్ ప ర్యటన అనంతరం విజయ్‌కుమార్‌ను పోలీసులు వదిలి పెట్టారు.