కొల్లాపూర్ : మండలంలోని తీగలపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచి , బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కన్నారెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి మాజీ సర్పంచ్( Former Sarpanch) నడిపి వీరారెడ్డి ( Veera reddy) శుక్రవారం సాయత్రం అనారోగ్యంతో మృతి చెందారు.
ఈ సందర్భంగా ఆయన మరణ వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూరెడ్డి రఘువరన్ రెడ్డి ( Raghuvaran Reddy ) శనివారం కోడేరు మండలంలోని తీగలపల్లి గ్రామానికి చేరుకొని నడిపి వీరారెడ్డి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వీరారెడ్డి కుమారుడు భాస్కర్ రెడ్డి ని ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించి , కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
వీరారెడ్డి మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అన్నారు. గ్రామ ప్రజలతోపాటు, మండలంలోని ప్రజలతో మంచి సంబంధాలు పెట్టుకోవడం మాత్రమే కాక రాజకీయాలకతీతంగా పనిచేశాడని కొనియాడారు. పార్టీ కార్యకర్తలను ఎల్లప్పుడూ ఉత్సాహపరిచే నాయకుడు జనం మధ్యలో లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు.
వీరారెడ్డి ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ముందుకు వెళ్లాలని సూచించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సూర్య రాజా శేఖర్ గౌడ్, వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు తీగలపల్లి గ్రామ సర్పంచ్ శివారెడ్డి , ముదిరెడ్డిపల్లి మాజీ సర్పంచి అంజన్ గౌడ్, ఎత్తం భాస్కర్ రెడ్డి , నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.